తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే చాలు - అన్నింటా విజయం పక్కా! - DAILY HOROSCOPE IN TELUGU

నవంబర్ 11వ తేదీ (సోమవారం) రాశిఫలాలు

Horoscope Today
Horoscope Today (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 4:01 AM IST

Horoscope Today November 11th 2024 : నవంబర్ 11వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా ఎలాంటి ఆందోళనలు లేని ప్రశాంతమైన రోజు. కాని ఒకేసారి అనేక పనులు చేయాలనుకోవడం మంచిది కాదు. ఇది మీకు తీరికలేకుండా చేసి ఒత్తిడి పెంచుతుంది. ఆచరణాత్మకంగా, వాస్తవికంగా, సహేతుకంగా ఉండండి. ఆదాయం సంతృప్తి కరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. రోజూవారీ పనుల నుంచి విరామం తీసుకొని స్నేహితులతో సరదాగా విహార యాత్రకు వెళ్లే సూచనలున్నాయి. మీ పియ్రమైన వారితో మీ అభిప్రాయాలను పంచుకుంటారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం సూచన ఉంది. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. శివారాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి ఈ రోజు వృత్తి పరంగా నిరుత్సాహంగా ఉంటుంది. కొత్త పనులు చేపట్టడానికి శుభప్రదంగా లేదు. మీ యజమానులు మీ పని పట్ల అసంతృప్తితో ఉంటారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన ప్రణాళికలు, నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. శత్రుభయం ఉన్నందున ఈరోజు ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఘర్షణలు చోటు చేసుకుంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. అనైతికమైన, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కార్యసిద్ధి హనుమాన్ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కలహాల కారణంగా వైవాహిక జీవితంలో ఆనందం కొరవడుతోంది. వృత్తి పరంగా క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. వ్యాపారంలో భాగస్వాముల మధ్య విబేధాలు ఏర్పడవచ్చు. మీ ప్రతిష్టకు భంగం కలిగే పనులేవీ చేయకండి. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు, వ్యాపారస్తులకు ఈ రోజు ఒక అద్భుతమైన రోజు. మీ పోటీదారులు, భాగస్వాములు, సహోద్యోగుల కంటే మీరు ఒక మెట్టు ఎత్తులో ఉంటారు. సహోద్యోగుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్వయంకృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. వృత్తి పరంగా జరిగే చర్చలలో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. వీలైనంత వరకు నిరాడంబరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభకరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ప్రాణ స్నేహితులు, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ఆత్మవిశ్వాసం, మనోబలం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలతో ప్రశాంతత లోపిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు పెరగడంతో ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది. కీలక వ్యవహారాల్లో కఠిన నిర్ణయాలు అవసరం. శివ పంచాక్షరీ మంత్రజపం శక్తినిస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఇంతకాలం మీ కఠిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుంది. వృత్తి పరంగా సహచరులతో ఏర్పడే అభిప్రాయభేదాలు వాదనకు దారి తీస్తాయి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. దైవబలంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. వినాయకుని ప్రార్ధన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా కొన్ని సమస్యలు ఎదురు కావడంతో భవిష్యత్ గురించి ఒత్తిడికి గురవుతారు. వాస్తవానికి విరుద్ధంగా పోవడం మంచిది కాదు. కీలక వ్యవహారాల్లో సందర్భానుసారంగా నడుచుకోవాలి. లక్ష్య సాధన కోసం తీవ్రమైన కృషి అవసరం. సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఈశ్వరునికి అభిషేకం చేయించడం వలన సత్ఫలితాలు ఉంటాయి.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, ఆర్ధికంగా ఈ రోజు చాలా లాభాలు పొందుతారు. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభ సమయం. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. మీ ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఈ రోజు స్నేహితుల నుంచి మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఆర్ధికంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడతారు. స్నేహితులకున్న విలువేంటో అర్థం చేసుకుంటారు. కుటుంబ శ్రేయస్సు కోసం పని చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details