Vastu Tips for Hanuman Photo :హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలనుకుంటున్నారా? అయితే, వాస్తు ప్రకారం కొన్ని విషయాలు తెలుసుకోవాలంటున్నారు వాస్తుశాస్త్ర పండితులు. ముఖ్యంగా.. ఏ రూపంలో ఉన్న విగ్రహాన్ని ఎంచుకోవాలి? ఏ దిశలో ఉంచితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? హనుమాన్ జయంతి రోజున ఏ విధమైన పూలు, నైవేద్యాలు సమర్పిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- వాస్తు ప్రకారం.. మీరు ఇంట్లో ప్రతిష్టించుకునే ఆంజనేయస్వామి(Hanuman) విగ్రహం లేదా చిత్రపటం పూజ గదిలో దక్షిణ దిశలో ఉండేలా చూసుకోవాలంటున్నారు వాస్తు పండితులు. అలాగే ఈ దిశలో 'కూర్చున్న భంగిమ'లో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిదంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయట.
- ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిత్యం స్వామిని పూజిస్తూ మంగళవారం సుందరకాండ పారాయణం చేయాలి. అప్పుడే మీకు హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయని చెబుతున్నారు వాస్తు పండితులు.
- ఇంట్లోని చీడ, పీడలను, దుష్టశక్తులను వదిలించుకోవడానికి ఇంటి దక్షిణ దిశ గోడపై కూర్చున్న భంగిమలో ఉన్న వాయుపుత్రుడి ఫొటోను తగిలించుకోవచ్చంటున్నారు. అయితే, ఈ ఫొటోలోని హనుమంతుడు ఎరుపు రంగులో ఉండే విధంగా చూసుకోవాలంటున్నారు.
- శత్రువులు, గృహ బాధలు, సంబంధాల్లో విభేదాలు, కుటుంబంలో ప్రతికూలతలు నివారించేందుకు.. వాస్తుప్రకారం పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం మంచిదని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అయితే, ఈ చిత్రపటం ప్రధాన ద్వారంపైన ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుందట.
- వాస్తుప్రకారం.. మీరు ఇంట్లోని డ్రాయింగ్ రూమ్లో శ్రీరామ దర్బార్ విగ్రహాన్ని పెట్టుకోవచ్చంటున్నారు వాస్తు పండితులు. అలాగే.. పంచముఖ ఆంజనేయస్వామి, హనుమంతుడు పర్వతాన్ని ఎత్తుతున్న ఫోటోను కూడా ఈ గదిలో ఉంచుకోవచ్చని చెబుతున్నారు
మంగళవారం హనుమాన్ జయంతి- అంజన్నకు ఇవి సమర్పిస్తే అన్నింటా విజయమే! - Hanuman Jayanti 2024
- ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కోసం ఆంజనేయస్వామి బొమ్మను ఇంట్లో ఉంచుకోవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే, హనుమంతుని శరీరంపై తెల్ల వెంట్రుకలు ఉన్న ఫొటో ఎంచుకుంటే మరీ మంచిదంటున్నారు.
- హనుమాన్ జయంతి రోజు హనుమంతుడికి నీరు సమర్పించిన తర్వాత.. పంచామృతాన్ని నైవేద్యంగా పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు.
- అదేవిధంగా.. నువ్వుల నూనెలో నారింజ, పచ్చిమిర్చి కలిపి నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
- ఈ రోజున వాయుపుత్రుడికి ఎరుపు రంగు పువ్వులు సమర్పించడం మంచిదంటున్నారు. అంతే కాకుండా.. బెల్లం లేదా గోధుమపిండితో చేసిన రోటి సుర్మాను నైవేద్యంగా పెట్టాలని చెబుతున్నారు.
- ఇలా చేయడం వల్ల భజరంగబలి సంతోషించి భక్తులకు సుఖసంతోషాలతో ప్రసాదిస్తాడని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.