Chintamani Ganpati Temple:హిందూ సంప్రదాయం ప్రకారం విఘ్నేశ్వరుని పూజించనిదే ఏ పనిని మొదలు పెట్టరు. మహారాష్ట్రలో వెలసిన అష్ట వినాయక క్షేత్రాలు ఒక క్రమ పద్ధతిలో దర్శిస్తేనే దర్శన ఫలం ఉంటుందని అంటారు. ఆ క్రమంలో దర్శించాల్సిన ఐదవ క్షేత్రం చింతామణి గణపతి క్షేత్రం. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఎక్కడ ఉంది, ఆ క్షేత్ర విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతామణి గణపతి క్షేత్రం ఎక్కడ ఉంది
విదర్భ ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకునే చింతామణి గణపతి క్షేత్రం మహారాష్ట్ర పూణే జిల్లా హవేలీ తాలూకాలోని ధేవూర్‌లో వెలసింది. ఈ చింతామణి దేవాలయం యావత్మాల్ నుండి 22 కి.మీ దూరంలో కలాంబ్ వద్ద ఉంది.
ఆలయ స్థల పురాణం
ఈ ఆలయంలో వినాయకుడికి చింతామణి గణపతిగా పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం కపిల మహర్షి దగ్గర కోరికలు నెరవేర్చు చింతామణి ఉండేది. రాజ వంశానికి చెందిన గణరాజు ఆ చింతామణిని బలవంతంగా తన సొంతం చేసుకుంటాడు. కపిల మహర్షి అభ్యర్థన మేరకు ఆ రాజును గణపతి సంహరించి ఆ చింతామణిని కపిల మహర్షికి అప్పగించాడు. కపిల మహర్షి చింతామణిని గణపతి మెడలో అలంకరిప్తాడు. కపిల మహర్షి కోరిక మేరకు గణపతి ఇక్కడ కొలువుదీరాడు. అందువలనే ఇక్కడి స్వామిని చింతామణి స్వామిగా భక్తులు పూజిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ ఆలయాన్ని పేష్వాల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది.
ఆలయంలో విశేష పూజలు
చింతామణి గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతాయి.