Bhanu Saptami Puja Vidhi In Telugu :ఏ రోజైతే ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తుందో ఆ రోజును భానుసప్తమి అని అంటారు. దానినే విజయ సప్తమి, కల్యాణ సప్తమి అని కూడా అంటారు. భాను సప్తమి రోజు చేసే సూర్యారాధన విశేష ఫలప్రదమని పండితులు చెబుతున్నారు. భానుసప్తమి సూర్యునికి సంబంధించిన పర్వదినం. ఈ రోజున చేసే పూజ, దానం, జపం, హోమం అత్యంత ఫలవంతం అని, ఈ పూజలు అనంతకోటి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం.
భానుసప్తమి ఎప్పుడు?
Bhanu Saptami 2024 Date : ఆగస్టు 11 వ తేదీ ఆదివారం, సప్తమి తిథి రోజున భాను సప్తమిగా జరుపుకుంటాం. ఈ రోజు పూర్తిగా సప్తమి తిధి ఉంది కాబట్టి సూర్యోదయం నుంచి ఉదయం 9 గంటల వరకు పూజకు శుభ సమయం.
భాను సప్తమి పూజా విధానం
- భాను సప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచియై సూర్యభగవానునికి నమస్కరించుకోవాలి.
- ఆవు పాలు పొంగించి అందులో పిడికెడు బియ్యం, బెల్లం, నెయ్యి వేసి మెత్తగా పరమాన్నం తయారు చేసుకోవాలి.
- సూర్యునికి ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని రథం ఆకారంలో ముగ్గు వేసుకుని అందులో మధ్యభాగంలో పద్మాన్ని వేసుకోవాలి. ముగ్గుకు నలువైపులా పూలతో, పసుపుకుంకుమలతో అలంకరించుకోవాలి.
- సూర్య భగవానునికి 12 సార్లు భక్తితో సూర్య నమస్కారాలు చేసి, రాగిపాత్రలో నీరు తీసుకొని అర్ఘ్యం సమర్పించాలి.
- ముందుగా తయారు చేసుకున్న పరమాన్నాన్ని సూర్య భగవానునికి నివేదించాలి. అనంతరం ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా అందరూ స్వీకరించాలి.
భానుసప్తమి పూజకు నియమాలు
- భానుసప్తమి పూజ చేసుకునే ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లి, వెల్లుల్లి, మధ్య మాంసాలు తీసుకోరాదు.
- కఠిన బ్రహ్మచర్యం పాటించాలి.