తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మీ లక్కీ నెంబర్​ ప్రకారం.. మీ ఇల్లు ఈ ఫేసింగ్​ లో ఉంటే మంచిదట! - BEST FACING HOUSE BY LUCKY NUMBER

- హిందూ సంప్రదాయంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత - ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​కుమార్​ వివరణ

Best Facing House Depending upon Lucky Number
Best Facing House Depending upon Lucky Number (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Best Facing House Depending upon Lucky Number : ఇంటి నిర్మాణ విషయంలో అత్యంత ప్రధానంగా చూసేది వాస్తు. వాస్తుకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే వాస్తు చూడకుండా ఇల్లు నిర్మాణం గానీ, కొనుగోలు గానీ చేయరు. వాస్తు సరిగ్గా ఉంటేనే అభివృద్ధి, ఆరోగ్యం సిద్ధిస్తాయని విశ్వసిస్తారు.

అయితే.. చాలా మంది ఇల్లు కట్టుకునేటప్పుడు సింహ ద్వారం.. తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య ఫేసింగ్​ ఉండేలా నిర్మిస్తారు. లేదంటే ఈ ఫేసింగ్​లో నిర్మించిన వాటినే కొనుగోలు చేస్తారు. దక్షిణ ఫేసింగ్​ ఉన్న మెయిన్​ డోర్స్​ ఉత్తమమైనది కాదని భావిస్తారు. అయితే.. కేవలం వాస్తు మాత్రమే కాకుండా అదృష్ట సంఖ్యను బట్టి కూడా ఇంటి ఫేసింగ్​ సెలక్ట్​ చేసుకోవాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​కుమార్​. ఇలా చేసుకోవడం ఐశ్వర్యం కలిసొస్తుందని చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

అదృష్ట సంఖ్యను ఎలా లెక్కించాలి:అదృష్ట సంఖ్య ఎలా తెలుసుకోవాలంటే.. పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వీటన్నింటిని కలిపినప్పుడు వచ్చే సింగిల్​ డిజిట్​ నెంబర్​ను అదృష్ట సంఖ్యగా చెబుతున్నారు. అంతేకాకుండా పుట్టిన తేదీనీ కలిపితే వచ్చిన నెంబర్​ను కూడా లక్కీ నెంబర్​గా చెబుతున్నారు. ఉదాహరణకు.. పుట్టినతేదీ 10/02/1990 అనుకుంటే.. 1+0+0+2+1+9+9+0= 22, 2+2=4. అంటే ఇక్కడ లక్కీ నెంబర్​ 4 అన్నట్టు.

అదృష్ట సంఖ్యను బట్టి ఏ ఇంట్లో ఉండాలి :

  • లక్కీ నెంబర్​ 1 ఉంటే వాళ్లకి తూర్పు సింహ ద్వారం కలిగిన ఇళ్లు కలిసొస్తుందని అంటున్నారు. ఇంటికి లేత గులాబీ రంగు వేస్తే ఇంకా మంచిదంటున్నారు.
  • అదృష్ట సంఖ్య 2 కలిగిన వారికి ఉత్తర సింహ ద్వారం ఉన్న ఇళ్లు కలిసొస్తుంది. ఇంటికి తెలుపు రంగు వేయించుకుంటే శుభం జరుగుతుందంట.
  • లక్కీ నెంబర్​ 1 ఉంటే వాళ్లకి తూర్పు, ఉత్తర సింహ ద్వారం రెండు కలిసొస్తాయని అంటున్నారు. ఈశాన్య ఫేసింగ్​ కూడా కలిసొస్తుందని అంటున్నారు. వీళ్లు లేత పసుపు రంగు లేదా క్రీమ్​ కలర్స్​ ఇంటికి వేయించుకుంటే మంచిదంటున్నారు.
  • అదృష్ట సంఖ్య 4 కలిగిన వారికి తూర్పు, దక్షిణ సింహ ద్వారం అదృష్టాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. గులాబీ లేదా తేనె రంగు ఇంటికి వేయించుకుంటే మంచి జరుగుతుందంటున్నారు.
  • లక్కీ నెంబర్​ 5 కలిగిన వారికి ఉత్తర దిక్కు సింహ ద్వారం ఉన్న ఇళ్లు కలిసొస్తుంది. లేత ఆకుపచ్చ రంగు ఇంటికి వేయించుకుంటే మంచిదంటున్నారు.
  • అదృష్ట సంఖ్య 6 కలిగిన వారికి తూర్పు, దక్షిణ, ఆగ్నేయ సింహ ద్వారం అదృష్టాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. తెలుపు లేదా లేత నీలం రంగు వేయిస్తే శుభ ఫలితాలు లభిస్తాయంటున్నారు.
  • లక్కీ నెంబర్​ 7 కలిగిన వారికి ఉత్తర దిక్కు, ఉత్తర ఈశాన్య సింహ ద్వారం ఉన్న ఇళ్లు కలిసొస్తుంది. మిక్స్​డ్​ కలర్స్​ ఇంటికి వేయించుకుంటే మంచిదంటున్నారు.
  • అదృష్ట సంఖ్య 8 కలిగిన వారికి పడమర ఫేసింగ్​, పడమర వాయువ్య ఇళ్లు అదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. నీలం రంగు వేయిస్తే శుభ ఫలితాలు లభిస్తాయంటున్నారు.
  • లక్కీ నెంబర్​ 9 కలిగిన వారికి దక్షిణ ఫేసింగ్​ లేదా దక్షిణ ఆగ్నేయ సింహ ద్వారం ఉన్న ఇళ్లు కలిసొస్తుంది. లేత గులాబీ లేదా మెరున్​ కలర్​ ఇంటికి వేయించుకుంటే మంచిదంటున్నారు.

Note :పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

'బీరువా లోపల ఈ వస్తువులు ఉండాలి - తప్పక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది'

పూజ గదిలోని ఈ వస్తువులను కింద పెడుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా? - Vastu Tips Telugu

ABOUT THE AUTHOR

...view details