తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా? - ఈ స్మూతీ తాగితే నీరసం అనేది ఉండదు!

Best and Healthy Smoothie : శివరాత్రి పండగ రానే వచ్చింది. ఈ రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే కొద్దిమంది కఠిన ఉపవాసం ఉంటే మరికొద్దిమంది మాత్రం పండ్లు, పాలు తీసుకుంటుంటారు. అలా ఉపవాసంలో ఏదో ఒకటి తినేవారు ఈ స్మూతీను ట్రై చేస్తే నీరసం అనేది మీ దరికి చేరదంటున్నారు నిపుణులు. ఆ స్మూతీ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 5:05 PM IST

Best and Healthy Smoothie to Keep Energetic on Mahashivaratri: మహాశివరాత్రి హిందువులకు ఎంతో పవిత్రమైన పర్వదినం. ఉదయం శివుడిని పూజించి, ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చేస్తారు. మరునాడు ఉదయం శివుడిని పూజించాకే ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల ఎంతో మంచి జరుగుతుందని.. ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే ఏడాదంతా శివుడిని ఆరాధించిన పుణ్యం దక్కుతుందని పండితులు అంటున్నారు. అలాగే అన్ని పాపాలకు మోక్షం లభిస్తుందని, విముక్తి కలుగుతుందని స్కంధ పురాణం, లింగ పురాణం, పద్మ పురాణంతో పాటు అనేక పురాణాలలో ఈ ప్రస్తావన ఉంది.

అయితే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఉపవాసం ఉండడం వల్ల శరీరం, మనసు శుద్ధి అవుతుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలు, మలినాలు బయటికి పోతాయి. అయితే కొంతమంది భక్తులు పూర్తిగా ఆహారం, నీరు తాగకుండా కఠిన ఉపవాసం చేస్తారు. మరికొందరు మాత్రం కొన్ని రకాల ఆహారాలను తింటారు. అలా ఉపవాసంలో ఏదో ఒకటి తినేవారు ఈ స్మూతీను ట్రై చేస్తే నీరసం అనేదే మీ దరికి చేరదని అంటున్నారు నిపుణులు. మరి ఆ స్మూతీ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

ఈ స్మూతీకి కావాల్సిన పదార్థాలు:

  • మఖానా - 12
  • డేట్స్​ - 2
  • వాల్​నట్​ - 1
  • కిస్మిస్​ - 6
  • దానిమ్మ గింజలు - 3 స్పూన్లు
  • నీరు - 150 మి.లీ
  • పుచ్చపప్పు - 1 టీ స్పూన్​
  • నానబెట్టిన చియా/ సబ్జా గింజలు - 2 టీస్పూన్లు

తయారీ విధానం:

  • ముందుగా మిక్సీ జార్​ తీసుకుని అందులోకి మఖానా వేసుకోవాలి.
  • ఆ తర్వాత గింజలు తీసిన డేట్స్​, వాల్​నట్​, కిస్మిస్​, పుచ్చపప్పు, దానిమ్మ గింజలు వేసుకోవాలి.
  • ఆ తర్వాత నీరు పోసుకుని మెత్తని స్మూతీలా వచ్చేవరకు గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఓ గాజు గ్లాస్​ తీసుకుని అందులోకి నానబెట్టిన చియా/ సబ్జా గింజలు వేసి గ్రైండ్​ చేసిన స్మూతీని అందులోకి పోయాలి.
  • ఆ తర్వాత మఖానా, దానిమ్మ గింజలతో గార్నిష్​ చేసుకోని తాగాలి.

ఆరోగ్యం కూడా:ఈ స్మూతీలో ఉపయోగించిన పదార్థాలు అన్ని కూడా ఆరోగ్యానికి మంచివే. మఖానా, ఖర్జూరం, వాల్​నట్​, కిస్మిస్​, దానిమ్మ గింజలు, పుచ్చపప్పు, చియా గింజలు.. వీటిల్లో అనేక రకాలు పోషకాలు కూడా ఉన్నాయి. గుండె ఆరోగ్యం, షుగర్​ నియంత్రణ, బలమైన ఎముకలు, రక్తపోటు నియంత్రణ, క్యాన్సర్​ వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

మహా శివరాత్రి స్పెషల్- అర్ధనారీశ్వరుడికి అనాస కేసరి!

మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేయాలి? మీకు తెలుసా?

మహాశివరాత్రి నాడు ఈ సంకేతాలు కనిపిస్తే - మీకు పరమేశ్వరుడి అనుగ్రహం లభించినట్టే!

ABOUT THE AUTHOR

...view details