Benefits of Moles on Body:మనిషి శరీరం మీద పుట్టు మచ్చలు ఉండటం సహజం. అయితే, జాతకాలను నమ్మేవారు.. శరీరంలోని కొన్ని భాగాలలో పుట్టుమచ్చలు ఉంటే, అదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు. కొన్ని పుట్టుమచ్చలను రాజయోగానికి సంకేతాలుగా భావిస్తారు. మరి, శరీరంలోని ఏ భాగాలలో పుట్టుమచ్చలు ఉంటే రాజయోగానికి సంకేతమో ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కొన్ని ప్రత్యేకమైన పుట్టుమచ్చలు, ప్రత్యేకమైన ప్రదేశాల్లో శరీరం మీద ఉంటే రాజయోగం పడుతుందని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోందట. ముఖ్యంగా పుట్టుమచ్చ తేనె రంగు లేదా గోధుమ రంగులో ఉన్నట్లైతే అది రాజయోగాన్ని కలిగిస్తుందని అంటున్నారు. అలా కాకుండా ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మధ్యమ ఫలితాలను అందిస్తుందని, నలుపు రంగులో పుట్టుమచ్చ ఉంటే అది అధమ ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. అయితే రాజయోగం కలగాలంటే పుట్టుమచ్చలనేవి పుట్టుకతోనే ఉండాలని అంటున్నారు. ఒకవేళ మధ్యలో పుట్టు మచ్చలు వస్తే వాటిని చెలికత్తె మచ్చలని అంటారని.. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనాలూ ఉండవని అంటున్నారు.
రాజయోగం కలిగించే పుట్టుమచ్చలు :
కళ్లు:ఎవరికైనా కంట్లో పుట్టుమచ్చ ఉంటే మంచిదని మాచిరాజు చెబుతున్నారు. మగవారికైతే కుడి కంట్లో, ఆడవారికైతే ఎడమకంట్లో తేనె రంగులో లేదా గోధుమ రంగులో పుట్టుమచ్చ ఉంటే మంచిదని.. అలాంటివారికి లక్షమందిలో ఒకరికి కలిగే అదృష్టం కలుగుతుందని అంటున్నారు.
వీపు: మగవారికి వీపు మీద పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిదని సూచిస్తున్నారు. వీపు మీద తేనె లేదా గోధుమ రంగులో పుట్టుమచ్చ ఉంటే అఖండ రాజయోగం కలుగుతుందని అంటున్నారు. అంటే రాజకీయాల్లో, సినీ ఫీల్డ్‌లో చక్రం తిప్పే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీపు మీద మచ్చ పెద్దగా ఉంటే ఆ రాజయోగం అనేది తారాస్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు.
పెదవులు: ఆడవారికి పెదవుల మీద పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిదని వివరిస్తున్నారు. ఏ మహిళకైనా పెదవి పై భాగంలో తేనె లేదా గోధుమ రంగులో పుట్టమచ్చ ఉంటే ఆ స్త్రీ మహర్జాతకురాలు అవుతుందని అంటున్నారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటుందని.. సంపదలకు లోటు లేకుండా జీవితం గడుస్తుందని చెబుతున్నారు.
మెడ : స్త్రీలకు మెడ మీద పుట్టుమచ్చ ఉన్నా అది అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తుందని అంటున్నారు.