Vastu Tips for Bedroom :వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ప్రతి జంటా అన్యోన్యంగా, సంతోషంగా జీవించాలనుకుంటుంది. కానీ.. కొన్ని జంటల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. దీనికి బెడ్ రూమ్‌లోని వాస్తు దోషాలే కారణం కావొచ్చంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అందువల్ల బెడ్రూమ్(Bedroom) లోకొన్ని వాస్తు నియమాలు తప్పక పాటించాలంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బెడ్ దిశ :చాలా మంది బెడ్‌రూమ్‌లో మంచాన్ని ఏ దిశలో పడితే ఆ దిశలో ఉంచుతుంటారు. కానీ మంచాన్ని సరైన దిశలో ఉంచడం చాలా అవసరమని చెబుతున్నారు. వాస్తుప్రకారం బెడ్‌రూమ్‌లో మంచాన్ని నైరుతి దిశలో ఉంచడం ఉత్తమం. అలా వీలు కాకపోతే.. దక్షిణం లేదా తూర్పు వైపు తలపెట్టి నిద్రించేలా చూసుకోవాలట. ఇలా ఉంచడం వల్ల దంపతుల మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుందని చెబుతున్నారు.
బెడ్ ఆకారం, పరుపు : వాస్తుప్రకారం.. బెడ్‌ను సరైన దిశలో ఉంచడమే కాదు మంచం ఆకారం కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. మంచం షేప్ సరిగా లేకపోతే ఇబ్బందులు వస్తాయట. కాబట్టి.. చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న మంచాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పరుపు విషయంలోను సౌకర్యవంతంగా ఉండే దానిని తీసుకోవాలని చెబుతున్నారు.
వాల్ కలర్స్ :బెడ్రూమ్ గోడలకు వేసే కలర్స్ కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడానికి కారణమవుతాయంటున్నారు. వాస్తుప్రకారం ఎప్పుడూ పడక గది గోడలకు లైట్ కలర్ పెయింట్స్ ఉండేలా చూసుకోవాలంటున్నారు. పాస్టెల్ కలర్స్, లేత గులాబీ, లేత పీచ్ కలర్ వంటి ప్రశాంతమైన రంగులను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇవి దంపతుల మధ్య ప్రేమను మరింత పెంచుతాయంటున్నారు.
కొత్తగా పెళ్లైన వారు బెడ్రూమ్ ఇలా సెట్ చేసుకున్నారంటే - బంధం బలపడడం ఖాయం!