Astrology Remedies by Birth Month :ప్రతి ఒక్కరు జీవితంలో అదృష్టం, ఐశ్వర్యం కోసం నిరంతరం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, అందరికీ తొందరగా విజయం వరించదు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పుట్టిన నెల ఆధారంగా కొన్ని పరిహారాలు పాటిస్తే విశేష ఫలితాలు పొందవచ్చని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. మీరు పుట్టిన నెలను బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే.. జీవితం మొత్తం అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.
చైత్ర మాసం :ఈ మాసంలో జన్మించిన వారు ప్రతిరోజు లేదా ఆదివారం రోజున పరమశివున్నిజిల్లేడు పూలతో పూజించాలి. వీరికి గులాబీ రంగు బాగా కలిసి వస్తుంది. తూర్పు దిక్కు వైపు ప్రయాణాలు చేస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు.
వైశాఖ మాసం :ఈ మాసంలో పుట్టిన వారు ఇష్ట దైవాన్ని రోజూ పూజించాలి. అలాగే వీలైతే తీపి పదార్థాలు చేసి నైవేద్యంగా సమర్పించాలి. వాటిని అందరికీ పంచిపెట్టాలి. అలాగే గురువులకి పండ్లు, వస్త్రాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. నీలం రంగు వస్త్రాలు వైశాఖ మాసంలో జన్మించిన వారికి బాగా కలిసి వస్తాయని.. వీరికి దక్షిణ దిక్కు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.
జ్యేష్ఠ మాసం :జ్యేష్ఠ మాసంలో జన్మించిన వారు లక్ష్మీ నారాయణులను పూజిస్తే అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు. అలాగే రోజూ విష్ణు సహస్రనామ పారాయణ చేసినా.. విన్నా మంచి జరుగుతుందని.. వేప చెట్టు, రావి చెట్టుని పూజించాలని చెబుతున్నారు. ఆలయానికి వెళ్లినప్పుడు అరటి పండ్లు దానం ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఆషాఢ మాసం :ఆషాఢ మాసంలో పుట్టిన వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయాలని చెబుతున్నారు. నిద్రలేవగానే భూమాతకు, గోమాతకు నమస్కారం చేయాలని చెబుతున్నారు. అలాగే వీలైనప్పుడల్లా కందిపప్పు, రాగి వస్తువులు ఎవరికైనా దానం ఇవ్వాలి. వీరికి ఎరుపు రంగు కలిసి వస్తుంది.
శ్రావణ మాసం :శ్రావణ మాసంలో జన్మించిన వారు వీలైనప్పుడు అలసందలతో గారెలు చేసి లక్ష్మీదేవికినైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు. అలాగే అమావాస్య రోజు స్వయంపాకంతో పాటుగా సుగంధ ద్రవ్యాలు ఉంచి ఎవరికైనా దానం ఇవ్వాలి. వీరు నీలం రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించాలి. గ్రామ దేవతల ఆలయాలను సందర్శిస్తే విశేషమైన శుభఫలితాలను కలిగిస్తుందని చెబుతున్నారు.
భాద్రపద మాసంలో :ఈ మాసంలో జన్మించినవారు దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజించాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఇష్టదైవానికి లేదా దత్తాత్రేయుడికి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి స్వీకరించాలి. విష్ణుసంబంధమైన ఆలయాల్లో శనగలను నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి పెట్టాలని చెబుతున్నారు.
ఆశ్వయుజ మాసం:ఈ మాసంలో జన్మించినవారు తొందరగా విజయం సాధించాలంటే.. కొండపైన ఉన్నటువంటి దేవాలయాలను సందర్శించాలి. పేద విద్యార్థులకు వీలైనప్పుడల్లా పుస్తక దానం చేయాలి. ముదురు నీలం రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఎక్కువగా ధరించాలి. దుర్గా మల్లేశ్వరులను పూజించాలి. గోదానం చేస్తే మంచి జరుగుతుంది.