ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / spiritual

'ఏం చేసినా మీ కష్టాలు పోవడం లేదా? - ఫైనల్​గా ఇంట్లో ఆ మూలన దీపం వెలిగించి చూడండి!' - ASTROLOGICAL REMEDIES

ప్రతి గురువారం ఈ ఒక్క పని చేయండి - మీ కష్టాలన్నీ పోతాయంటున్న పండితులు

astrological_remedies
astrological_remedies (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2025, 5:58 PM IST

Updated : Feb 1, 2025, 7:03 PM IST

Astrological Remedies :మనిషి జీవితమే నిరంతర పోరాటం, నిత్య సంఘర్షణ. చాలా మంది ఎన్ని రకాల పూజలు, పరిహారాలు, దాన ధర్మాలు చేసినా వారి కష్టాలు తీరడం లేదని భావిస్తుంటారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ ఓ చక్కని ఉపాయం చెప్తున్నారు. అలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

ఇంట్లో ఈశాన్యం దిక్కున దీపం వెలిగించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. ఆ దీపం ఎప్పుడు వెలిగించాలి? ఎలా వెలిగించాలి? ఏ రోజు, ఏ సమయంలో వెలిగించాలో ఆయన స్వయంగా వెల్లడించారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని తెలిపే సంకేతాలివే - కలలో పాము కనిపిస్తే ఏం జరుగుతుందంటే!

ఇంటికి ఈశాన్యం దిక్కు (తూర్పు, ఉత్తరం కలిసే మూల)లో దీపం పెట్టడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. పరమేశ్వరుడు ఈశాన్యం దిక్కు అధిపతి కాబట్టి కాబట్టి అక్కడ వెలిగించే దానిని ఈశాన దీపం అంటారు.

ఈ దీపాన్ని సరిగ్గా గురువారం రోజున 'గురుహోర' సమయంలో వెలిగించాలి. గురహోర సమయం అంటే ఉదయం ఆరు గంటల నుంచి 7గంటల మధ్య శక్తి వంతమైన సమయం ఉంటుంది. ఆ సమయంలో ఈశాన్య దీపం వెలిగిస్తే ఎంతో శుభం జరుగుతుంది.

ఈ సమయంలో తల స్నానం చేసి ఈశాన్యం దిక్కులో కొత్త పీట వేసుకోవాలి. పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పీట పైన బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. పీటపై మట్టి ప్రమిదపై మరో మట్టి ప్రమిద పెట్టి, వాటికి బొట్టు పెట్టుకోవాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఆ మూడు కూడా విడివిడిగా ఉండాలి. అవి ఈశానుడైన పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. అందుకే గురువారం రోజున 'గురుహోర' సమయంలో దీపం పెడితే ధన ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు.

దీపమే గాకుండా మరో పరిష్కారాన్ని కూడా మాచిరాజు సూచించారు. సకల దేవతా స్వరూపమైన ఆవుదూడ బొమ్మ కూడా ఎంతో ఫలితాన్నిస్తుందట. ఈశాన్యం దిక్కులో ఆవుదూడ ప్రతిమను పెట్టి పూజిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయట. పీట వేసి దానిపై ఆవుదూడ బొమ్మ పెట్టుకుని దీపం పెట్టాలి. పుష్పాలు లేదా అక్షింతలు వేసి పూజిస్తే సరిపోతుంది.

తరచూ ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుందట. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుందట. అకస్మాత్తుగా సంక్షోభం జీవితంలో మరేదైనా సమస్య వచ్చినట్లయితే దీపం వెలిగించాలని సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

తాళికట్టు శుభవేళ - ఇక వరుసగా ఐదు నెలల్లో పెళ్లి ముహూర్తాలు

'అవన్నీ మర్చిపోండి!' ఇదొక్కటి చాలు - అందం, ఆరోగ్యానికి సూపర్!

Last Updated : Feb 1, 2025, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details