Astrology Remedies to Preserve Assets: కొంత మంది పొలం, భూములు, ఇల్లు వంటివి ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు. మరికొందరికి తాతముత్తాతల నుంచి ఆస్తులు వస్తాయి. అంతా బాగుందీ అనుకునే క్రమంలో కొన్ని సందర్భాల్లో జీవితంలో ఎదురయ్యే అనుకోని కారణాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అలా కాకుండా స్థిరాస్తులు నిలబడాలంటే కొన్ని తాంత్రిక పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. సంపాదించిన ఆస్తులు నిలబడడానికి చేయాల్సిన కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలను ఇప్పుడు చూద్దాం.
పంచలోహ కూర్మం విధి : ఇంట్లో ఉత్తర దిక్కులో రాగి పళ్లెం ఉంచి అందులో పంచలోహాలతో తయారు చేసిన తాబేలు బొమ్మను పెట్టండి. అలాగే అక్కడ 21 రూపాయి నాణాలు ఉంచండి. ఇలా తాబేలు బొమ్మను ఉత్తర దిక్కులో ఉంచడం వల్ల స్థిరాస్తులు నిలబడతాయని మాచిరాజు తెలిపారు.
కుండ పరిహారం : గురువారం రోజున ఒక కొత్త కుండను ఇంటికి తెచ్చుకోవాలి. అయితే, ఎప్పుడైనా కుండ కొత్తది కొన్నప్పుడు దానికి చాక్పీస్తో ఇంటూ గుర్తు పెట్టుకుని తెచ్చుకోవాలట. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా మరణిస్తే కొత్త కుండ కొంటారు. ఆ దోషం రాకుండా ఉండడానికి X మార్క్ రాసి ఇంటికి తెచ్చుకోవాలి. ఆపై కుండకు పసుపు రంగు వస్త్రం చుట్టి ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయండి. మీ ఇంట్లో ఉత్తర దిక్కులో వేలాడదీస్తే చాలా మంచిది. మళ్లీ వచ్చే గురువారం రోజున ఆ కుండను తీసేసి మూలన పెట్టాలి. మళ్లీ అదే రోజున కొత్త కుండను కొనుగోలు చేసి పసుపు రంగు వస్త్రం చుట్టి వేలాడదీయాలి. ప్రతి గురువారం పాత కుండనీ తీసేసి కొత్త కుండను వేలాడదీయాలి. అలా 7 గురువారాలు చేయాలి. ఎనిమిదవ గురువారం రోజున ఆ కుండలను ఎక్కడైనా పారే నీళ్లలో వదిలేయాలి. లేదా ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో వేయాలి. ఇది జీవితంలో ఒక్కసారి చేస్తే ఆ ఇంట్లో స్థిరాస్తులు నిలబడతాయని మాచిరాజు పేర్కొన్నారు.
శివపూజ : సాధారణంగా అందరూ శివాలయంలో నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తుంటారు. కానీ, వేపనూనెతో దీపం తక్కువ మంది వెలిగిస్తుంటారు. అయితే, సోమవారం రోజున ఉదయం శివాలయ ప్రాంగణంలో వేపనూనెతో దీపం వెలిగించడం వల్ల స్థిరాస్తులు నిలబడతాయని చెబుతున్నారు. ఇలా నెలకు ఒక్కసారి దీపం వెలిగించాలని మాచిరాజు సూచిస్తున్నారు. ఇంట్లో శివలింగం ఉన్నవారు శంఖజలాలతో అభిషేకం చేయండి. తెల్ల జిల్లేడు పూలతో శివుడిని పూజించండి. ఈ ప్రత్యకమైన పరిహారాలు పాటించడం వల్ల స్థిరాస్తులు నిలబడతాయని తెలుపుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
'చింతలు తీర్చే 'చింత కొమ్మ తాంత్రిక పరిహారం' - ఇంటి వాస్తు దోషాలకు చెక్'
కడప వెంకన్న స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు- విశేషాలు, వివరాలు ఇవే!