ETV Bharat / state

మార్ఫింగ్ ఫొటోలు- బాలిక ఆత్మహత్యాయత్నం- తండ్రికి గుండెపోటు - PHOTO MARFING CASE IN YERRABALEM

బాలిక చిత్రాన్ని మార్ఫింగ్ చేసిన యువకుడి అరెస్టు-ఈ వ్యవహారంపై కలత చెందిన బాలిక ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి..

PHOTO MARFING CASE  IN GUNTUR DISTRICT
PHOTO MARFING CASE IN GUNTUR DISTRICT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 3:24 PM IST

Student Photo Marfing Case In Guntur District: గుంటూరు జిల్లాలో ఓ బాలిక చిత్రాన్ని మార్ఫింగ్ చేసి బెదిరించిన యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. స్థానికంగాఉన్న బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తూ బెదిరింపులకు దిగాడని పోలీసులు వెల్లడించారు. గత 10 రోజులుగా వేధింపులు తీవ్రతరం అయ్యాయి. దీంతో తీవ్ర స్థాయిలో ఆందోళన చెందిన బాలికతో ఆత్మహత్యాయత్నానికి దిగింది. ఇది తెలుసుకున్న తండ్రికి గుండెపోటు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు యువకుడిని ఆరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. వివరాలోనికి వెళ్తే..

స్థానికంగా ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై భాషా అనే యువకుడు తరచూ బాలికను వేధించేవాడు. అప్పటికీ బాలిక లొంగకపోయే సరికి ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి ఆమె ఫోన్​కు పంపి బెదిరింపులకు దిగాడు. తనకు లొంగకపోతే ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెడతానని బాలికను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక తని మాటలను ఖాతర చేయకపోవడంతో అన్నంత పని చేశాడు. దీంతో తీవ్ర కలత చెందిన బాలిక ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో అసలు విషయం బయటకు పొక్కింది. ఈ విషయం బాలిక తండ్రికి తెలియడంతో ఆయనకు గుండెనొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బాలిక ఫొటోను మార్ఫింగ్ చేసిన యువకుడిని అరెస్టు చేశారు.

''8 వ తగరతి చదువుకునే బాలిక ఫొటోలను ఓ యువకుడు మార్ఫింగ్ చేసి వాటిని సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశాడు. దీంతో ఆవేదన చెందిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. అదే విధంగా బాలిక తండ్రికి సైతం గుండెపోటు వచ్చింది. మేము అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. అపరిచిత వ్యక్తులెవరైనా పరిచయమైతే వారితో జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత వివరాలేమీ వారికి ఇవ్వకండి'' -శ్రీనివాసరావు, సీఐ, మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్

యువతి వీడియో కాల్ - లిఫ్ట్ చేసిన ఇంజినీరింగ్​ విద్యార్థికి దిమ్మతిరిగే షాక్

Nude video call వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్‌, ఆపై బెదిరించి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.