ETV Bharat / politics

ఏపీ, దిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారు: సీఎం చంద్రబాబు - CHANDRABABU ON DELHI ELECTIONS

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై స్పందించిన సీఎం చంద్రబాబు - మోదీపై నమ్మకంతోనే దిల్లీలో బీజేపీ గెలుపని వెల్లడి

Chandrababu_on_Delhi_elections
Chandrababu_on_Delhi_elections (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 5:32 PM IST

Updated : Feb 8, 2025, 6:53 PM IST

CM Chandrababu on BJP victory in Delhi elections: ప్రధాని మోదీపై ఉన్న నమ్మకంతోనే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీ ఎన్నికల ఫలితాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. దిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారని అన్నారు. 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని వాటిని తెలుగుబిడ్డ పీవీ తీసుకువచ్చారని గుర్తుచేశారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని మౌలిక వసతులు వస్తాయని అన్నారు. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగిందని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో 3000 డాలర్ల (సుమారు రూ.2.63 లక్షలు) తలసరి ఆదాయం ఉందని బిహార్‌లో తలసరి ఆదాయం ఇంకా 750 డాలర్లే (సుమారు రూ.65వేలు) ఉందని సీఎం తెలిపారు. టెక్నాలజీ సాయంతో మనం ముందుకెళ్లామని అంతేకాకుండా మనకు ఐటీ, మౌలిక వసతులు గేమ్‌ఛేంజర్‌గా మారాయని అన్నారు. రాష్ట్రాల్లో సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్టేనని అన్నారు. చాలా రాష్ట్రాలను దాటుకుని గుజరాత్‌ తలసరి ఆదాయం పెరిగిందని స్థిరమైన పాలన, పాలసీలు, గ్రోత్‌ గుజరాత్‌ అభివృద్ధికి కారణమైందని అన్నారు. కొందరు నాయకులు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతి చేస్తున్నారని ఇంక రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఎక్కడ చూసినా చెత్తే: ఆప్‌ పాలనలో దిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని సీఎం అన్నారు. కొన్ని విధానాల వల్ల అత్యంత కాలుష్య నగరంగా దిల్లీ మారిందని తెలిపారు. ఏపీ, దిల్లీలో అమలు చేసిన పాలసీలకు విజయం దక్కలేదని అన్నారు. ప్రజల ఆకాంక్షలను వారు పట్టించుకోలేదని ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేశారని అన్నారు. సంపద సృష్టించలేని, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకని సీఎం ప్రశ్నించారు. ప్రజల జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం పెరుగుతూ ఉండాలని సూచించారు. ఏపీ, దిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని అన్నారు. మంచి నాయకత్వంలో ముందుకెళ్తే 2047 నాటికి మన దేశమే నంబర్‌ వన్‌ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రధాని మోదీపై విశ్వాసం మరోసారి రుజువైంది: పవన్‌కల్యాణ్‌

అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుండాలి: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలపాలన్నదే తనకున్న స్వార్థమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయడం తన లక్ష్యమన్నారు. రాజకీయ పార్టీల పాలనా విధానాలు, పాలనా సమయాన్ని కూడా నీతి అయోగ్ లాంటి సంస్థలు బేరీజు వేసి ప్రజల మధ్య పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల మంత్రుల పనితీరుపై ర్యాంకులు ఇవ్వలేదని దానిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమర్ధత బేరీజు కాదు ఎంత వేగంగా ఫైల్స్ డిస్పోస్ చేశారన్న దానికి కొలమానం మాత్రమే అని చెప్పారు. విద్వంసం చేసి 30 ఏళ్లు పాలన అనుకుంటే ఎలా అని అంత గర్వం పనికిరాదని మండిపడ్డారు.

విద్వంసం చేయడం సులభమే: జగన్ పాలనలో రాష్ట్రంలో గంజాయి విచ్చల విడిగా పెరిగిందని శాంతి భద్రతలు లేవని అన్నారు. కాని కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం 7 నెలల్లో మార్పు తెచ్చామనని అన్నారు. గంజాయి విక్రయించినా, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినా అలాంటి వారికి అదే ఆఖరిరోజు అని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భావాలు అవసరమన్న సీఎం ఆయన వ్యక్తిగత భావాలు కావన్నారు. పదో వంతు ఓట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారని ఇదేమి ఇప్పటి నిబంధన కాదని సీఎం తెలిపారు.

గతంలో రాష్ట్రంలో ఆన్​లైన్ పెమెంట్లు కూడా లేకుండా చేసేసారని సీఎం గుర్తుచేశారు. ప్రజల డబ్బుతో ఏపీలో రుషికొండ ప్యాలస్ నిర్మిస్తే దిల్లీలో శేష్​మహల్ కూడా ఆ తరహా లోనే నిర్మాణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఎమ్మార్వో కార్యాలయం తాకట్టు పెట్టి, మద్యం ఆదాయం తాకట్టు పెట్టే అప్పులు తెచ్చారని మండిపడ్డారు. విద్వంసం చేయడం సులభమే కానీ నిర్మాణం చేయడమే చాలా కష్టమని చంద్రబాబు అన్నారు.

ఏపీ, దిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారు (ETV Bharat)

దిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్​ - ఏపీలో బీజేపీ నేతల సంబరాలు

ఈనెల 10న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం

Last Updated : Feb 8, 2025, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.