- దేశంలోని పవిత్ర నగరాలు- 108
- భరతనాట్యంలో భంగిమలు- 108
- ఉపనిషత్ల సంఖ్య- 108
- జపమాలలో ఉండే పూసలు- 108
గుడిలో 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకుంటాం- 108 ప్రదక్షిణలు చేయాలని అంటుంటాం- ఇలా సనాతన సంస్కృతిలో ఎక్కడ చూసినా 108 సంఖ్య గురించే వినిపిస్తోంది. నిజానికి 108 సంఖ్యకు విశేష ప్రాధాన్యం ఉంది. ధర్మశాస్త్రాల్లో 108 సంఖ్యను ఎంతో పవిత్రమైనదిగా, పరిపూర్ణమైనదిగా భావిస్తారు. అందుకే 108తో ముడిపడిన అనేక అంశాలు మనకు మేలు చేస్తాయని అన్ని ధర్మశాస్త్రాల్లో వివరించారు. చూడ్డానికి చిన్న సంఖ్య అయినప్పటికీ దీనికి చాలా లోతైన, శాస్త్రీయ వివరణలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
108 అంటే అమృతతత్వం
108 Number Importance In Hinduism: 108 సంఖ్యను అమృతతత్వానికి చిహ్నంగా వివరిస్తారు. సముద్ర మథనం చేసే సమయంలో 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు పాల్గొని, పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని బయటకు తీశారు. ఇలా అమృతాన్ని బయటకు తీయడంలో 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు మొత్తం 108 మంది కలిసి కృషి చేశారు. అందుకే 108కి అమృతతత్వం ఉందని మన పురాణాల్లో వివరించారు.
ఆయుర్వేదంలో 108 :
ఆయుర్వేద శాస్త్రంలోనూ 108కి ప్రాధాన్యం ఉందని తేలింది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరానికి 108 ఆయువు పట్లు ఉంటాయని, ఈ ఆయువు పట్లలో ఏర్పడిన సమస్యను గుర్తించి పరిష్కరిస్తే ఆరోగ్య సమస్యలు తీరుతాయి.