ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

పోలవరం నిర్వాసితులను జగన్ నమ్మించి ముంచారు: షర్మిల - YS Sharmila Public Meeting - YS SHARMILA PUBLIC MEETING

YS Sharmila Public Meeting in Polavaram Constituency: పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయని ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో టీడీపీ, వైసీపీ ప్రేమాయణం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ్ యాత్రలో భాగంగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో షర్మిల రోడ్‌ షో నిర్వహించారు.

sharmila_public_meeting
sharmila_public_meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 10:46 PM IST

YS Sharmila Public Meeting in Polavaram Constituency:పోలవరం నిర్వాసితులను జగన్ నమ్మించి నిండా ముంచారని కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకుండా మొండి చేయి చూపించారని ధ్వజమెత్తారు. న్యాయ్ యాత్రలో భాగంగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో షర్మిల రోడ్‌ షో నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయని ప్రత్యేక హోదా ఇవ్వని భాజపాతో తెలుగుదేశం, వైసీపీ ప్రేమాయణం సాగిస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా , పోలవరం ప్రాజెక్టుకు భాజపా సహకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రతి ఒకరూ ఆలోచించి ఓటేయాలని షర్మల పిలుపునిచ్చారు.

ఇక్కడ మేనేజ్​ చేసుకున్నా అక్కడ శిక్ష తప్పదు- వివేకా హత్యపై బ్రదర్​ అనిల్​ సంచలన వ్యాఖ్యలు - Brother Anil On Viveka murder

రైతులను అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని షర్మిల మండిపడ్డారు. రైతుల కోసం జగన్ రూ.3 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయని అన్నారు. ఐదేళ్లు పాలించిన జగన్‌ గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా అని విమర్శించారు. జగన్ మద్యపానం నిషేధం చేయకపోగా నాసిరకం మద్యం అమ్మారని ఆరోపించారు. ప్రభుత్వం అమ్మిన బ్రాండ్ మద్యమే కొనాలని ఈ నాసిరకం మద్యంతో 25 శాతం మంది చనిపోతున్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల అన్నారు.

జగనన్న సభ ఉంది జాగ్రత్త!- సిద్దం సభలతో జనం అవస్థలు - People in trouble in Jagan meetings

పోలవరం ఎమ్మెల్యే ఇసుక బాలరాజు అంట మొత్తం ఇసుక దోచేశాడట అని ఎద్దేవా చేశారు. ఆయనకు చెడ్డపేరు వచ్చిందట అందుకని ఆయన భార్యకు ఇచ్చారని అన్నారు. దోపిడీ చేయడానికి ఎవరైతే ఏంటని అన్నారు. జగన్ వచ్చారు ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు. ఎకరాకు 10లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు కాని ఒక్క ఎకరానికైన ఇచ్చారా అని ప్రశ్నించారు. ముంపు బాధితులకు కాలనీలు కట్టి ఇస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ 10 ఏళ్లలో ప్రాజెక్ట్ ఒక్క అడుగు పడలేదని చంద్రబాబు, జగన్ ఇద్దరూ ప్రజలను మోసం చేశారని షర్మిల అన్నారు.

కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మంచి రోజులు - అన్నివర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు : చంద్రబాబు - CBN Guarantees

చంద్రబాబు, జగన్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని మోసం చేశారని షర్మిల ధ్వజమెత్తారు. అధికారం అనుభవిస్తూ ఒక్క రోజు కూడా ఉద్యమం చేయలేదని అన్నారు. రాజధాని అని జగన్ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. బాబు సింగపూర్ అని 3డీ గ్రాఫిక్స్ చూపించి అమరావతి పైరుతో బ్రమరావతి కట్టారని అన్నారు. మరి జగన్ మూడు రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని కూడా రాలేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అయ్యిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తె పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు.

పోలవరం నిర్వాసితులను జగన్ నమ్మించి ముంచారు: షర్మిల

ABOUT THE AUTHOR

...view details