ETV Bharat / politics

'నారా లోకేశ్ డిప్యూటీ సీఎం అంశం' - ఎవరూ మాట్లాడవద్దని అధిష్ఠానం ఆదేశం - NARA LOKESH AS DEPUTY CM ISSUE

వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని స్పష్టం చేసిన పార్టీ అధిష్ఠానం

Nara Lokesh as Deputy CM
Nara Lokesh as Deputy CM (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2025, 4:27 PM IST

Updated : Jan 20, 2025, 5:14 PM IST

Nara Lokesh as Deputy CM Issue : మంత్రి నారా లోకేశ్​కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే పలువురు నాయకులు స్పందించారు. ఈ విషయంపై టీడీపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఈ అంశంపై ఇక ఎవరూ మాట్లాడవద్దని అధిష్ఠానం నేతలకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకుంటారని వెల్లడించింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని హైకమాండ్ సీరియస్​గా చెప్పింది.

అసలేం జరిగదంటే : కొద్ది రోజులుగా లోకేశ్​కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని పలువురు నేతలు బహిరంగంగానే మాట్లాడారు. శనివారం నాడు సీఎం చంద్రబాబు వైఎస్సార్ జిల్లా మైదుకూరులో పర్యటించారు. ఈ క్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేశ్​ డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే పార్టీ భవిష్యత్ బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదే విషయంపై ఆదివారం నాడు పిఠాపురం తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ కూడా స్పందించారు. టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత లోకేశ్​కే దక్కుతుందని, పార్టీకి భవిష్యత్ లేదన్న వారందరికీ యువగళంతో సమాధానం చెప్పారని తెలిపారు. అందుకే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని చెప్పారు. దీనిపై కొన్ని సోషల్ మీడియాలో, మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదని హితవు పలికారు.

లోకేశ్‌ కష్టాన్ని గుర్తించాలని పార్టీ కోరుకోవడంలో తప్పేముందని ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ప్రశ్నించారు. చివరికి తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యమని వర్మ వెల్లడించారు. ఈ క్రమంలోనే అప్రత్తమైన టీడీపీ హైకమాండ్ ఈ విషయంపై ఇక ఎవరూ మాట్లాడవద్దని, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చింది.

టీడీపీ సభ్యత్వ నమోదులో రికార్డ్​ - కార్యకర్తల ఇన్సూరెన్స్​ కోసం ఒప్పందం

అందుకే విద్యాశాఖ తీసుకున్నా - కష్టపడితేనే విజయం: లోకేశ్

Last Updated : Jan 20, 2025, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.