Railway Group D Recruitment 2025 : రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో దాదాపు 32 వేలకు పైగా లెవెల్ -1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి /ఐటీఐ విద్యార్హతతో గ్రూప్-డి లెవెల్ -1 కేటగిరీలో వివిధ విభాగాల్లో మొత్తం 32,438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేటి (జనవరి 23) నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలు :
వయో పరిమితి :
జనవరి 1, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్సీ/ఓబీసీ/పీహెచ్/ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీల కింద అభ్యర్థులకు వయో సడలింపు (Age relaxation) ఉంటుంది.
విద్యార్హతలు:
పదో తరగతి ఉత్తీర్ణత/ఐటీఐ లేదా తత్సమాన విద్యార్హత లేదా NCVT జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులు.
పోస్టుల వివరాలు:
- సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్ (ఎస్ అండ్ టీ)
- మెకానికల్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ తదితర విభాగాల్లో అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ)
- వర్క్‌షాప్ అసిస్టెంట్, అసిస్టెంట్ లోకోషెడ్ (డీజిల్/ఎలక్ట్రికల్/) పాయింట్స్‌మన్
- అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్)
- అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, ట్రాక్ మెయింటెయినర్ తదితర పోస్టులు ఉన్నాయి.
- ప్రారంభ వేతనం: నెలకు రూ.18 వేలు చొప్పున అందిస్తారు.
ఉద్యోగ ఎంపిక ఇలా :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
పరీక్ష ఎలా ఉంటుంది?
ఇది కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్. 90 నిమిషాల పాటు జరిగే ఈ ఎగ్జామ్‌లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - 30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. తప్పు సమాధానం రాస్తే 1/3 మార్కుల మైనస్ చేస్తారు.
అప్లికేషన్ ఫీజు :
- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500
- దివ్యాంగులు/మహిళలు, ట్రాన్స్‌జెండర్లు/ఎక్స్‌సర్వీస్‌మెన్/ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ వర్గాలు/ఈబీసీలు రూ.250 చొప్పున చెల్లించాలి.
- ఎగ్జామ్‌కు హాజరయ్యాక జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.400లు, మిగతా వారికి రూ.250లు రిఫండ్ చేస్తారు.
అప్లికేషన్లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 రాత్రి 11.59 గంటల వరకు అవకాశం కల్పించారు. దీనికోసం రూ.250 (నాన్ రిఫండబుల్) చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 6 తర్వాత అప్లికేషన్లో మార్పులకు ఎలాంటి అవకాశం ఉండదు.
అప్లై చేసేటప్పుడు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నంబర్లు 0172-565-3333, 9592001188కు కాల్ చేయవచ్చు. లేదా rrb.help@csc.gov.in ఈ- మెయిల్ ద్వారా హెల్ప్ పొందొచ్చు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు (పని దినాల్లో మాత్రమే) ఫోన్ చేయాలి.
రైల్వే జోన్‌ల వారీగా భర్తీ చేసే జాబ్స్, వయో పరిమితిలో రిజర్వేషన్లు, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్న బుక్‌లెట్ ఇక్కడ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
'స్టేట్ ఫైబర్ నెట్'లో ఉద్యోగాలు - దేశవ్యాప్తంగా మరెన్నో ఖాళీలకు దరఖాస్తులు