జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు వైఎస్ఆర్ అశయాలు ఎలా నిలబెడతారు: షర్మిల YS Sharmila Allegations on CM Jagan:త్వరలో జరిగే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, రాహుల్ గాంధీ ప్రధాని అయిన మరుక్షణం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఫైలుపై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడి వద్ద నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ప్రత్యేక హోదా విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని ఆమె ఎద్దేవా చేశారు. వైయస్సార్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్నారు పరిశ్రమలు లేక నిరుద్యోగులు అవకాశాలు లేక వలస వెళ్లిపోయే దుస్థితి పట్టిందని ఆరోపించారు.
కడప జిల్లాలో వైఎస్ షర్మిలకు భద్రత పెంపు: ఎస్పీ సిద్ధార్థ కౌశల్
జగన్మోహన్ రెడ్డికి తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని కేవలం సిద్ధాంతపరమైన పోరాటమే తప్ప వేరే ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అశయాలు ఏ విధంగా నిలబెడతారని షర్మిల ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న జగన్ మద్యం పేరిట దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేయకుండా ఇప్పుడు ఏ విధంగా ఓట్లు అడుతారని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ పాలన ప్రజల చేతుల్లో పెడతానని మాటిస్తున్నట్లు వెల్లడించారు.
వైఎస్ షర్మిల, సునీతపై సోషల్ మీడియాలో కామెంట్స్ - స్పందించిన రాహుల్ గాంధీ
వైఎస్‌ఆర్ సంక్షేమ పాలనను ప్రజల గడప ముందుకు తీసుకువస్తానంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఎవరి వద్ద డబ్బులు తీసుకున్నా ఆలోచించి ఓటు వేయండని మీరు వేసే ఓటు జీవితాలను మార్చే ఆయుధమని సూచించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు షర్మిల అభ్యర్థించారు. అవకాశం ఇస్తే చిత్తశుద్ధితో పని చేస్తానని, వైఎస్‌ఆర్ పాలనను మీ ముంగిటకు తీసుకువస్తానంటూ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మైసూరా రెడ్డి, ఏఐసీసీ సభ్యులు ఉత్తర శ్రీరామ్మూర్తి నర్సీపట్నం నియోజకవర్గ నాయకుల మీసాల సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.
దిల్లీలో దీక్షకు సిద్ధమైన షర్మిల - విభజన హామీలపై ప్రధాని మోదీకి లేఖ
ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబాన్నే తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడిందా లేదా అని మన రాష్ట్ర పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. మేము అంటున్నది ప్రజలు మీకు ఓటు వేస్తే మీరు సీఎం అయ్యారు. అలాంటి ప్రజలకు మీరు మేలు చెయ్యాలని బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజున రైతు వ్యవసాయం చేసి పంట పండిస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోతే రైతులకు మీ ప్రభుత్వం ఏం మేలు చేసింది. రాష్ట్రానికి పెద్ద పరిశ్రమలు రావడం లేదు ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి. వైసీపీలో ఉన్న ఒక్క ఎంపీ అయినా ప్రత్యేక హోదా గురించి కేంద్రంలో మాట్లాడారా.- వైఎస్ షర్మిల, పీసీసీ అధ్యక్షురాలు