ETV Bharat / politics

దావోస్​లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం - 20న వెళ్లనున్న సీఎం చంద్రబాబు టీమ్​ - CM CHANDRABABU TEAM VISIT DAVOS

జనవరి 20 నుంచి 24 వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు - హాజరుకానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

CM_Chandrababu_team_visit_Davos
CM_Chandrababu_team_visit_Davos (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2025, 7:11 PM IST

Updated : Jan 1, 2025, 7:21 PM IST

CM Chandrababu Team will visit Davos for 4 Days: సీఎం చంద్రబాబు బృందం ఈ నెల 20వ తేదీ నుంచి 4 రోజుల పాటు దావోస్​లో పర్యటించనుంది. స్విట్జర్లాండ్​లోని దావోస్​లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు సీఎం నేతృత్వంలోని ఏపీ బృందం హాజరు కానుంది. ఈ మేరకు రాష్ట్రం నుంచి ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు అవసరమైన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదాన్ని తెలియచేసింది.

జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తదితరులు హాజరు కానున్నారు. చంద్రబాబు బృందంతో పాటు పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్​మెంట్​ బోర్డు అధికారులు కూడా దావోస్ సదస్సుకు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్​లు దావోస్​లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివరించనున్నారు.

ప్రత్యేకమైన థీమ్​తో ప్రదర్శన: రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుద్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల గురించి అలానే రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించేలా దావోస్​లో పర్యటన సాగనుంది. 'షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్' అనే థీమ్తో ఈ సారి దావోస్​లో ప్రదర్శన ఏర్పాటు చేయనుంది. వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్​తో పాటు రాష్ట్రానికి ప్రత్యేకంగా ఓ స్టాల్​ను కేంద్రం రిజర్వు చేసింది.

అమరావతి అభివృద్ధి చెందే నగరం - ఇక సినిమాలన్నీ ఏపీలోనే: సీఎం చంద్రబాబు

ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం - వాళ్లే నాకు హైకమాండ్​: సీఎం

Last Updated : Jan 1, 2025, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.