CM Chandrababu Approves Release of CMRF Funds: నూతన సంవత్సరం తొలిరోజు సీఎం చంద్రబాబు రూ.24 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పేదలకు లబ్ది చేకూర్చే ఫైల్‌పై 2025లో మొదటి సంతకం చేశారు. ఈ నిర్ణయం ద్వారా 1,600 మంది దరఖాస్తుదారులకు రూ.24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు 7,523 మందికి లబ్దిదారులకు రూ.100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేశారు.
సీఎం చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ కోసం మొత్తం 124.16 కోట్ల నిధులను విడుదల చేసింది. మొత్తం 9,123 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరింది. ఈ క్రమంలో ఉండవల్లి నివాసంలో సీఎంను కలిసిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం అధికారిక గృహంగా ఉండవల్లి నివాసం: సీఎం చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఉండవల్లిలోని గృహన్ని సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 జూన్ 12వ తేదీ నుంచి తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, కృష్ణా కరకట్ట వద్ద ఉన్న నివాసాన్ని సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ సాధారణ పరిపాలన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం: సీఎం చంద్రబాబు సీఎస్ విజయానంద్ సహా వివిధశాఖల అధికారులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అనంతరం విజయవాడ, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై జిందాల్ ప్రతినిధులతోనూ రేపు మద్యాహ్నం సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
అమరావతి అభివృద్ధి చెందే నగరం - ఇక సినిమాలన్నీ ఏపీలోనే: సీఎం చంద్రబాబు
2024 చరిత్ర తిరగరాసింది - అందరికీ భవిష్యత్‌పై భరోసా వచ్చింది: సీఎం చంద్రబాబు