ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఐదేళ్లుగా మాట్లాడకుండా వివేకాపై విద్వేషం ఎందుకు జగనన్నా?: సునీత - Sunita Fire on Jagan - SUNITA FIRE ON JAGAN

Sunita Fire on CM Jagan : వివేకా హత్యపై ఐదేళ్లుగా ఒక్క మాట కూడా మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ద్వేషం ఎందుకు కక్కుతున్నారని సునిత ప్రశ్నించారు. వివేకాని చంపించిన నిందితులకు టికెట్ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తుంటే వారిని పక్కన పెట్టుకొని మాట్లాడడం సబబేనా అని ఆమె ప్రశ్నించారు.

sunita_fire_on_cm_jagan
sunita_fire_on_cm_jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 7:33 PM IST

Sunita Fire on CM Jagan : మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎంతో త్యాగం చేసిన వివేకానందరెడ్డి చనిపోయినా ఎందుకు అంత ద్వేషంతో ఆయనపై మాట్లాడుతున్నారని సీఎం జగన్​ను సునీత ప్రశ్నించారు. ఈరోజు పులివెందుల బహిరంగ సభలో జగన్ మాట్లాడిన మాటలు చూస్తుంటే వివేకానంద రెడ్డి పైన తీవ్రస్థాయిలో ఈర్ష్య ఉన్నట్లు కనిపించాయని పేర్కొన్నారు. పులివెందులలో మీడియాతో మాట్లాడిన సునీత ఐదేళ్లుగా ఒక్క మంచి మాట కూడా మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతనిపైన ద్వేషం ఎందుకు కక్కుతున్నారని ప్రశ్నించారు. వివేకాని చంపించిన నిందితులకు టికెట్ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తుంటే వారిని పక్కన పెట్టుకొని మాట్లాడడం సబబేనా అని ప్రశ్నించారు.

అవినాష్ రెడ్డి నేర చరిత్రపై ఈసీకి ఎందుకు నివేదించలేదు?: వైఎస్ సునీత రెడ్డి - Avinash Reddy criminal history

సీబీఐ చెప్పిన అంశాలను తాము మాట్లాడుతుంటే పదేపదే ఆయన వ్యక్తిత్వాన్ని అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలోనే మాట్లాడడం మంచిదేనా అని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి లాంటి మంచి మనిషి గురించి కుటుంబ సభ్యుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంత ఘోరంగా అంత అసూయతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని సునీత ప్రశ్నించారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి ఏం పాపం చేశాడని ఆయన గురించి అంత హీనంగా మాట్లాడుతున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

వివేకా హత్య వెనకుంది అతడే- ప్రజా తీర్పు కోసమే సాక్ష్యాలు చూపిస్తున్నా: సునీతా - YS Sunitha About Viveka Murder Case

సీఎం జగన్‌కు న్యాయవ్యవస్థ అన్నా, సీబీఐ అన్నా నమ్మకం లేదని వైఎస్ వివేకా కూతురు సునీత అన్నారు. తన తండ్రి హత్యపై మాట్లాడవద్దంటూ కోర్టు ఆర్డర్‌ తెచ్చిన వాళ్లే మాట్లాడుతున్నారని సీఎం జగన్​ను ఉద్దేశించి పేర్కొన్నారు. సీఎం జగన్‌కు ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో చెప్పాలని అంటూ తప్పు చేసుంటే తనకైనా, తన భర్తకైనా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. పులివెందులలో మీడియాతో మాట్లాడిన సునీత పులివెందులలో సీఎం జగన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. జగన్‌ చేసిన వ్యాఖ్యల్లో వివేకాపై ద్వేషం కనిపిస్తోందని, ఏం పాపం చేశారని వివేకాపై మీకు ఇంత ద్వేషం అని ప్రశ్నించారు. మీ కోసం త్యాగం చేశారు కాబట్టే.. వివేకాపై ద్వేషమా? అని ఆమె నిలదీశారు.

కొంగుచాచిన తోబుట్టువులకు ఏం చెప్తావ్ జగన్? - Sisters fire on CM Jagan

సీఎం జగన్​పై జరిగిన రాయి దాడిపైనా సునీత స్పందించారు. సీఎం జగన్‌ ఎక్కువ రోజులు బ్యాండేజ్‌ ఉంచుకోకూడదని, బ్యాండేజ్‌ ఎక్కువ రోజులు ఉంచుకుంటే సెప్టిక్‌ అవుతుందని చెప్పారు. వైద్యులు జగన్‌కు సరైన సలహా ఇవ్వలేదన్న సునీత.. గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుందని, బ్యాండేజ్‌ తీసేయాలని ఒక డాక్టర్‌గా జగన్‌కు సలహా ఇస్తున్నా అని చెప్పారు.

నేను బయటకు వెళ్లాక నరికి చంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు: సునీత - YS Vivekananda Reddy murder Case

ABOUT THE AUTHOR

...view details