తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఎన్నికల్లో ఓటమి, ముఖ్య నేతల వలసల ఎఫెక్ట్​ - తెలంగాణ భవన్​కు వాస్తు మార్పులు - Vasthu Changes In Telangan Bhavan - VASTHU CHANGES IN TELANGAN BHAVAN

Vasthu Changes In Telangan Bhavan : తెలంగాణ భవన్​కు వాస్తుమార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు నేతల వలసల నేపథ్యంలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ భవన్​లోకి వెళ్లేందుకు ఇప్పటి వరకు వాయువ్యంలో ఉన్న గేటును ఉపయోగిస్తుండగా, ఇక నుంచి ఈశాన్యంలో ఉన్న గేటును ఉపయోగించాలని నిర్ణయించారు. తద్వారా వాస్తు మార్పుతో పాటు ట్రాఫిక్ సమస్యను కూడా అధిగమించవచ్చని భావిస్తున్నారు.

Vasthu Changes In Telangan Bhavan
Vasthu Changes In Telangan Bhavan

By ETV Bharat Telangana Team

Published : Apr 4, 2024, 5:28 PM IST

Updated : Apr 4, 2024, 6:36 PM IST

ఎన్నికల్లో ఓటమి, ముఖ్య నేతల వలసల ఎఫెక్ట్​ - తెలంగాణ భవన్​కు వాస్తు మార్పులు

Vasthu Changes In Telangan Bhavan :పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అధికారాన్ని కోల్పోవడంతో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. పరాజయం పాలైన తరుణంలో పార్టీ నుంచి నేతల వలసలు కూడా ఊపందుకున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు (People Representatives) మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. సీనియర్ నేతలైన కేశవరావు, కడియం శ్రీహరిలాంటి వారు కూడా పార్టీని వీడారు. మరికొంత మంది పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

వాస్తుదోషం కారణంగానే పార్టీకి కష్టాలు!సార్వత్రిక ఎన్నికల నాటికి, లోక్​సభ ఎన్నికల (Lok Sabha Polls) తర్వాత వలసలు ఇంకా ఎక్కువగా ఉంటాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్​కు వాస్తు దోషం (vasthu Dhosam) కారణంగా ఈ కష్టాలు వచ్చాయని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించారు. వీటిలో ప్రధానమైనది తెలంగాణ భవన్​లోకి వెళ్లే గేటు.

Vaastu Renovation For T Bhavan :తెలంగాణ భవన్ తూర్పు అభిముఖంగా ఉండగా, వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అలా రావడం మంచిది కాదని, ఈశాన్యం వైపు ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగించడం మేలన్న అభిప్రాయం ఉంది. దీంతో వాయువ్యం దిశలో ఉండే గేటుకు బదులుగా ఈశాన్యంలోని గేటును ఇక నుంచి రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును (GATE) సిద్ధం చేస్తున్నారు. వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

BRS party Focus on vasthu changes :ఈశాన్యం గేటు ద్వారా వాహనాల రాకపోకలకు వీలుగా ర్యాంపు నిర్మిస్తున్నారు. వీధి పోటును దృష్టిలో ఉంచుకొని లక్ష్మీ నరసింహ స్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని కూడా గేటుకు ఏర్పాటు చేశారు. రాకపోకలను వాయువ్యం నుంచి ఈశాన్యం వైపు మార్చడానికి ట్రాఫిక్ సమస్య (Traffic Problem) కూడా కారణమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రోడ్ నంబర్ 12 వైపు వెళ్లే ప్రధాన రహదారి వెంట వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ట్రాఫిక్ కూడా చాలాసార్లు నిలిచిపోతోంది. దీంతో తెలంగాణ భవన్ (Telangana Bhavan)లోకి వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతోంది.

ఒకటి, రెండు వాహనాలను కూడా వాయువ్యం దిశలో ఉన్న గేటు వద్ద కాసేపు కూడా నిలిపి ఉంచే పరిస్థితి లేదు. దీంతో ఈశాన్యం గేటును రాకపోకలకు ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ సమస్యను కూడా అధిగమించవచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రాంగణం లోపల కూడా అవసరమైన మేరకు చిన్నపాటి మార్పులు, చేర్పులు చేస్తున్నారు.

బీఆర్ఎస్​కు షాక్ - బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌

ఎన్నికల ముంగిట బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్‌ - వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య - Kadiyam Kavya Drops Lok Sabha Seat

బీఆర్​ఎస్​కు మరో షాక్ - కాంగ్రెస్​ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్

Last Updated : Apr 4, 2024, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details