తెలంగాణ

telangana

ETV Bharat / politics

17 స్థానాలు, 875 మంది అభ్యర్థులు, 1488 సెట్ల నామినేషన్లు - అత్యధికంగా మల్కాజిగిరిలో - MP Nominations in Telangana - MP NOMINATIONS IN TELANGANA

Lok Sabha Election Nominations in Telangana : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. నేటి నుంచి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుంది. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 895 మంది 1,488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

Total Lok Sabha Election Nominations in Telangana
Total Lok Sabha Election Nominations in Telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 8:55 AM IST

Lok Sabha Election Nominations in Telangana :రాష్ట్రంలో 17 స్థానాలకు లోక్​సభ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభమై 25వ తేదీతో పూర్తి అయింది. అభ్యర్థులు వేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిశీలన కూడా నేటి నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఉపసంహరణకు సోమవారం చివరి రోజుగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 895 మంది నామినేషన్లను దాఖలు చేశారు. వీరంతా 1,488 సెట్ల నామినేషన్లు వేశారు. అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో 114 మంది నామినేషన్లు వేయగా, ఆదిలాబాద్​లో అతి తక్కువగా 23 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.

ఇందులో చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63, భువనగిరిలో 61, వరంగల్​లో 58, సికింద్రాబాద్​లో 57, మెదక్​లో 54, కరీంనగర్​లో 53, ఖమ్మంలో 45, నిజామాబాద్​లో 42, మహబూబ్​నగర్​లో 42, జహీరాబాద్​లో 40, నాగర్​ కర్నూల్​ 34, మహబూబాబాద్​లో 30 మంది నామినేషన్లను వేశారు. అలాగే మరోవైపు అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతున్న సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ నియోజకవర్గంలో 24 మంది 50 నామపత్రాలు సమర్పించారు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు - ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే

అయితే ఈ నెల 18 నుంచి ప్రారంభిమైన ఎన్నికల నామినేషన్లు పర్వంలో కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ అభ్యర్థులు భారీ ర్యాలీలను నిర్వహించారు. ఎన్నికల నామినేషన్లను కూడా కోలాహలంతో ముందుకుపోనిచ్చారు. ఇక ఎన్నికల ప్రచార సమరమే ముందు ఉన్న విషయం. శుక్రవారం(నేడు) నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల సంఘం అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఈరోజే ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు, అన్​ రిజిస్టర్డ్​ రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించనున్నారు.

చివరి రోజు నామినేషన్ల పర్వం : ఈనెల 25వ తేదీనే నామినేషన్లకు చివరి రోజు కావటంతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎన్నికల అధికారుల కార్యాలయాలకు తరలి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల లోపు కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి వారి నుంచి నామినేషన్లు స్వీకరించారు. అయితే వారితో ఎన్నికల అధికారులు ప్రమాణం చేయించడంతో ఈ ప్రక్రియ ఉదయం వరకు కొనసాగింది. ఫైనల్​గా 895 నామినేషన్లు వేశారు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిలో అర్హులు ఎంతమందో గుర్తించి ఈ నెల 29న తుది ఓటర్ల జాబితాను రూపొందించి అభ్యర్థులకు అందిస్తారు.

అట్టహాసంగా చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు - భారీ ర్యాలీలు, రోడ్‌షోలతో అభ్యర్థుల దాఖలు

ఎన్నికల నామినేషన్ల సందడి - ఉమ్మడి ఖమ్మం నుంచి బరిలో 76 మంది

ABOUT THE AUTHOR

...view details