RAGHURAMA RAJU CASE : ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ పాల్‌కు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. రఘురామకు కస్టోడియల్ టార్చర్‌లో గాయాలైనట్లు గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయ పడిందని సీనియర్ న్యాయవాది ఆదినారాయణ హైకోర్టుకు తెలిపిన వాదనను పరిగణలోకి తీసుకొని మధ్యంతర ముందస్తు బెయిల్ నిరాకరించింది. కస్టోడియల్ టార్చర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
'దాడి వెనక వారి హస్తం - బయట కారులో కూర్చొని పర్యవేక్షించారు' - Attack ON TDP Central Office Case
పోలీస్ కస్టడీ పేరిట తనపై హత్యాయత్నం జరిగిందని గుంటూరు జిల్లా పోలీసులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్‌పై ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. తన పుట్టిన రోజు నాడే ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెట్టారని, అరెస్టు చేసిన రోజే తనకు చివరి రోజు అవుతుందని అనుకున్నట్లు రఘురామ వెల్లడించారు.