తెలంగాణ

telangana

ETV Bharat / politics

ప్రజాభవన్‌లో ముగిసిన ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం - షెడ్యూల్‌ 10లోని అంశాలపై ప్రధానంగా సాగిన చర్చ - Telugu States CMs Meeting Today - TELUGU STATES CMS MEETING TODAY

Telugu States CMs Meeting Today : ప్రజా భవన్​ వేదికగా సాగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ ముగిసింది. విభజన చట్టంలోని వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. సుమారు రెండు గంటలపాటు ఇరువురు చర్చలు సాగాయి. వీటిలో పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై అధికారుల సూచనలు సీఎంలు తీసుకున్నారు.

Telugu States Chief Ministers Meeting Today
Telugu States CMs Meeting Today (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 4:54 PM IST

Updated : Jul 6, 2024, 8:29 PM IST

Telugu States Chief Ministers Meeting Today :విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా, హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్​లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన భేటీలో పది కీలక అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల సీఎంలు అధికారుల సూచనలు తీసుకున్నారు. ఈక్రమంలోనే న్యాయపరమైన చిక్కులపై కూడా చర్చించారు. షెడ్యూల్‌ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగగా, నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చినట్టు తెలిసింది.

CM Revanth Presented book to AP CM Chandrababu : ముందుగా జూబ్లీహిల్స్‌ నుంచి ప్రజాభవన్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రజాభవన్‌లోకి చేరుకున్న చంద్రబాబును శాలువతో సత్కరించిన రేవంత్‌రెడ్డి, కాళోజీ నారాయణరావు రాసిన 'నా గొడవ' పుస్తకాన్ని బహుకరించారు. అనంతరం విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్​ పుస్తకం బహూకరణ (ETV Bharat)

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రత్యేక భేటీ : ఈ సమావేశంలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్​బాబు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాలశాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్​ పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూశ్​ కుమార్‌తో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్​లు శాంతికుమారి, నీరబ్‌కుమార్‌ ప్రసాద్​తో పాటు ఇతర శాఖల అధికారులు పలువురు హాజరయ్యారు. విభజన వివాదాలపై అధికారుల మధ్య సుమారు 30 సమావేశాలు జరిగితే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే తొలిసారి.

ఎజెండాలోని అంశాలివే :ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం గడిచింది. నాటి నుంచి కీలకాంశాలు ఎన్నో పెండింగ్‌లో ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగినా చాలా విషయాలు కొలిక్కి రాకుండా అలానే పెండింగ్​లో ఉన్నాయి. సీఎంల భేటీ సందర్భంగా ఉమ్మడిగా ఎజెండా అంశాలను ఖరారు చేశారు.

  • రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, షెడ్యూలు10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు
  • విభజన చట్టంలో పేర్కొనని కంపెనీల ఆస్తుల పంపకాలు
  • ఏపీ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ అంశాలు
  • విద్యుత్తు బిల్లుల బకాయిలు
  • విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాల వివరాలు
  • ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు పేమెంట్స్​
  • హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఏపీకి కేటాయించే అంశం
  • లేబర్‌ సెస్‌ పంపకాలు
  • ఉద్యోగుల విభజన అంశాలు

తెలంగాణ ఆస్తుల విషయంలో సీఎం రేవంత్​ రాజీ పడొద్దు : వినోద్​ కుమార్​ - Vinod Kumar on CMs Meeting

తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ - BJP MP Laxman said CMs Meeting

Last Updated : Jul 6, 2024, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details