ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

టీడీపీలో తీవ్ర పోటీ - పెండింగ్​ స్థానాల్లో అభ్యర్థులు వీరేనా ! - TDP Pending Seats - TDP PENDING SEATS

TDP Pending Seats : తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికపై బీజేపీ, జనసేన పార్టీల పొత్తు ప్రభావం చూపుతోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 144 స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ తొలి దశలో 96, రెండో జాబితాలో 34, తాజాగా మరో 11 మంది అభ్యర్థులను వెల్లడించింది. 17 ఎంపీ స్థానాలకు గాను మరో నాలుగింట అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

tdp_pending_seats
tdp_pending_seats

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 12:40 PM IST

TDP Pending Seats : తెలుగుదేశం మరో ఐదు అసెంబ్లీ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఆయా స్థానాల్లో బీజేపీ, జనసేన సీట్లతో ముడిపడకపోవచ్చు. ప్రాథమిక అంచనా ప్రకారం చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావు లేదా కళా వెంకట్రావు, భీమిలిలో గంటా శ్రీనివాసరావు లేదా కళా వెంకట్రావు, దర్శిలో శిద్దా రాఘవరావు, లేదా ఆయన కోడలు, గుంతకల్లులో గుమ్మనూరు జయరాం ?, ఆలూరులో వైకుంఠం కుటుంబం లేదా వీరభద్రగౌడ్ పోటీలో ఉన్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించినందున, ఎచ్చర్ల బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ ఇన్ఛార్జ్​గా ఉన్న కళా వెంకట్రావుకి చీపురుపల్లి లేదా భీమిలి ఇవ్వొచ్చునని తెలుస్తోంది.

టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల - TDP Candidates Third List

గంటా శ్రీనివాసరావు చీపురుపల్లికి ఓకే అంటే కళా భీమిలి వెళ్లే అవకాశం ఉంది. గంటా భీమిలినే సాధిస్తే కళాకు చీపురుపల్లి కావచ్చు. ఇదిలా ఉండగా బీజేపీ ఆదోని స్థానం అడుగుతుండగా, తెలుగుదేశం ఆలూరు ఇస్తానంటోంది. ఆదోనిలో ముస్లిం మైనార్టీలకు, హిందువులకు మధ్య విభేదాలు దృష్ట్యా ఆలూరు తీసుకోవాలని తెలుగుదేశం కోరుతోంది. ఆదోనినే కావాలని బీజేపీ పట్టుబడుతోంది. అనంతపురం అర్బన్ అసెంబ్లీ జనసేనకా లేక తెలుగుదేశం పార్టీకా అని కూడా తేలాల్సి ఉంది. తిరుపతి అసెంబ్లీ బదులు అనంతపురం జనసేన కోరుతున్నందున ఇందులో ఒకటి బీజేపీ, మరొకటి జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయి.

హామీలపై బదులిచ్చాకే బస్సెక్కు - జగన్​కు చంద్రబాబు సవాల్ - Chandrababu fire on Jagan

తెలుగుదేశం ఇంకా ప్రకటించాల్సి ఉన్న 4 పార్లమెంట్ స్థానాల్లో కడప - రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి (వైఎస్ వివేకా హత్య సెంటిమెంట్ దృష్ట్యా ఈ సీటుపై కాస్త వేచి చూసే ధోరణితో తెలుగుదేశం ఉంది. ఒంగోలు - మాగుంట శ్రీనివాసుల రెడ్డి లేదా ఆయన తనయుడు రాఘవరెడ్డి మధ్య సందిగ్ధత (పార్టీ తండ్రి పోటీ చేయాలని కోరుతుంటే కుటుంబం కొడుకుని నిలబెడతామంటోంది), అనంతపురం - జేసీ పవన్ రెడ్డి పేరు కొత్తగా తెరమీదకు వచ్చింది. బీసీ అయితే సాఫ్ట్​ వేర్​ నాగరాజు పేరు పరిశీలనలో ఉంది. విజయనగరం లేదా రాజంపేట (పొత్తులో భాగంగా విజయనగరం తొలుత బీజేపీకి కేటాయించాలనుకున్నారు).

పవన్ Vs జగన్​​ - పిఠాపురంపై వైఎస్సార్సీపీ స్పెషల్​ ఫోకస్​ - అసంతృప్తి నేతలకు బుజ్జగింపు - YSRCP target on Pawan Kalyan

ఉత్తరాంధ్రలో పక్కపక్కనే ఉన్న మరో నాలుగు పార్లమెంటు స్థానాలైన అరకు, అనకాపల్లి, నర్సాపురం, రాజమండ్రిల్లో కూడా బీజేపీ పోటీ చేస్తున్నందున విజయనగరం బదులు రాయలసీమలో రాజంపేట స్థానం బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరఫున పోటీకి సిద్ధంగా ఉండగా, విజయనగరంలో ఆ పార్టీకి సరైన అభ్యర్థి లేడు. విజయనగరం పార్లమెంట్ తెలుగుదేశం తీసుకుంటే, తూర్పు కాపు సామాజిక వర్గం నెల్లిమర్ల (పొత్తులో జనసేనకు పోయింది) తెలుగుదేశం ఇన్ఛార్జ్ కర్రోతు బంగారు రాజు పేరు పరిశీలించవచ్చు. లేదా కళా వెంకట్రావు ఎంపీ అభ్యర్థిగా తీసుకుంటే బంగార్రాజును గంటా పోటీ చేయని చీపురుపల్లి లేదా భీమిలిలో సర్దుబాటు చేయొచ్చు. అనూహ్యంగా మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు చివరి అవకాశం అంటూ కూడా తెరపైకి రావొచ్చు.

'రాష్ట్రానికి రాజధాని ఏదీ ? - ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఐక్య పోరాటాలు' - Sharmila fire on BJP

ABOUT THE AUTHOR

...view details