Telangana Lok Sabha Election Campaign 2024 : ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Polls) ప్రచార జోరు ఊపందుకుంటోంది. నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్‌రెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో నిలిచారు. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్‌ను అధిష్ఠానం ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించగానే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ఇన్‌ఛార్జులను కలిసి ప్రజలకు దగ్గరయ్యేలా నియోజవర్గస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, మాజీమంత్రులను కలిసి మద్దతు కూడకడుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు(strategy) రచిస్తున్నారు.
వరుస సమావేశాలతో దూసుకుపోతున్న పార్టీలు :నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు(MP Candidates) కుందూరు రఘువీర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి సమావేశాల్లో ముందే ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి హుజూర్‌నగర్, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో స్థానిక నేతలను కలిసి సమావేశాలు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి పరిచయాలతో ఈ సారి ఎన్నికల్లో తనకు కలిసొస్తుందని భావిస్తున్నారు. బీజేపీ నేతలతో నియోజకవర్గస్థాయి(Constituency) సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో కలిసి నియోజకవర్గ స్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రసవత్తరంగా లోక్‌సభ ఎన్నికల రాజకీయం - పోటాపోటీగా ప్రధాన పార్టీల ప్రచారం - LOK SABHA ELECTIONS 2024