తెలంగాణ

telangana

ETV Bharat / politics

నేడే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - మహిళలకు వడ్డీలేని రుణం పథకం పునరుద్ధరణపై నిర్ణయం! - Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting Today : లోక్‌సభ ఎన్నికల ముంగిట నేడు రాష్ట్రమంత్రి వర్గం సమావేశం కానుంది. నారాయణపూర్-కొడంగల్ ఎత్తిపోతల, మహిళలకు వడ్డీ లేని రుణం పథకాలను కేబినెట్‌ ఆమోదించనున్నట్లు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి సిఫార్సు చేసే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనే అంశంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

cabinet meeting today
cabinet meeting today

By ETV Bharat Telangana Team

Published : Mar 12, 2024, 7:02 AM IST

నేడే మంత్రివర్గ సమావేశం - మహిళలకు వడ్డీలేని రుణ పథకం పునరుద్ధరణ

Telangana Cabinet Meeting Today :లోక్​సభ ఎన్నికలను కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధ్యక్షతను సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో మహిళాలకు వడ్డీ లేని రుణ పథకం(Interest Free Loan Scheme for Women) పునరుద్ధరణ, స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా కల్పన వంటి అంశాలపై నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశాలతో సాయంత్రం సికింద్రాబాద్​ పరేడ్​ మైదానంలో భారీ మహిళా సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తోంది.

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 10 మండలాలకు తాగు, సాగు నీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట-కొడంగల్​ ఎత్తిపోతల పథకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటు ఘటనపై జ్యుడిషియల్‌ విచారణ చేయించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం దీనిపై చర్చించి ఆమోదించనుంది.

రాష్ట్రంలో ఇక ఏటా జాబ్‌ క్యాలెండర్‌ - ప్రామాణిక ముసాయిదా సిద్ధం చేస్తున్న టీఎస్‌పీఎస్సీ

Telangana Cabinet Meeting Live News : రైతు భరోసా పథకాన్ని మరింత కఠినంగా అమలు చేయడానికి అందుకు కావాల్సిన మార్పులుచేర్పులు చేయడంపైనా కూడా కేబినెట్​ చర్చించనున్నట్లు సమాచారం. వచ్చే వానాకాలం నుంచి పంటల బీమా అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలపై(Governor Quota MLCs) ఇటీవల హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం, సియాసత్‌ పత్రిక ఎడిటర్‌ ఆమిర్‌ అలీఖాన్‌ల పేర్లను మంత్రివర్గం మరోసారి గవర్నర్‌ ఆమోదం కోసం పంపించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కార్పొరేషన్లు లేని సామాజికవర్గాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్​ మ్యానిఫెస్టోలో చెప్పినట్లు ఆయా సామాజిక వర్గాలకు కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగుల డీఏపై చర్చించే అవకాశం : ఈ కేబినెట్​ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్​ డీఏలపై చర్చించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రి మండలి సమావేశానికంటే ముందు ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన జీవో 317పై మంత్రి మండలి ఉప సంఘం సచివాలయంలో సమావేశం కానుంది. మంత్రి దామోదర రాజనర్సింహ ఛైర్మన్‌గా ఉన్న ఈ ఉప సంఘంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ సభ్యులు. ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) హైదరాబాద్​లోని ఎంసీఆర్​హెచ్​ఆర్డీఐలో పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యి వారి సమస్యల పరిష్కారానికి హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉప సంఘం సమావేశంలో జీవో 317కు సంబంధించి మంత్రిమండలికి చేయాల్సిన సిఫార్సులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదే - ఉద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ

టీఎస్​ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​న్యూస్ - పీఆర్సీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details