Telangana Budget Sessions 2024 : తెలంగాణ శాసనసభ సమావేశాలు ఒకరోజు విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాలపై తీర్మానం ప్రవేశపెట్టింది. అనంతరం కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు - కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు అనే పేరుతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని ఆరోపించారు. దీనిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao on Krishna Water Dispute) స్పందిస్తూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండించారు.
Debate On Krishna Water in Assembly : ఈ నేపథ్యంలో హరీశ్ రావుకు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య వాడివేడి చర్చ జరిగింది. దక్షిణాది తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Assembly Speech Today) అన్నారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని మండిపడ్డారు. ఆయన రాకుండా హరీశ్ రావును పంపి పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారని విమర్శించారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్
"బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఎందుకు అసెంబ్లీకి రాలేదు. ప్రతిపక్ష నేత ఎందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడట్లేదు? ఇంత ముఖ్యమైన అంశంపై మాట్లాడేందుకు కేసీఆర్ ఎందుకు రాలేదు? కేసీఆర్‌ను అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పమనండి. కేసీఆర్ సభకు వస్తే మీరు ఎంత సేపైనా మైక్ ఇవ్వండి. దక్షిణాది తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉంది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్(KCR) చర్చల్లో పాల్గొనలేదు. హరీశ్‌రావు సభలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఓ వ్యక్తి (పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి) కరీంనగర్ నుంచి తరిమికొడితే మహబూబ్‌నగర్ వాసులు ఎంపీగా గెలిపించారు." - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి