తెలంగాణ

telangana

ETV Bharat / politics

బీజేపీ ప్రచార దూకుడు- ప్రత్యర్థులే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు - bjp election campaign 2024 - BJP ELECTION CAMPAIGN 2024

Telangana BJP Lok Sabha Election Campaign 2024 : లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన స్థానాలే లక్ష్యంగా, బీజేపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజాక్షేత్రంలో విస్తృతంగా తిరుగుతున్న కమలం అభ్యర్థులు మూడోసారి మోదీని గెలిపించేందుకు తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అత్యధిక నిధులు రావాలంటే బీజేపీ అభ్యర్థులకే ఓటేయాలని కోరుతున్నారు.

DK Aruna fires on CM Revanth
BJP Election Campaign 2024

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 8:01 PM IST

Telangana BJP Lok Sabha Election Campaign 2024 :రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలపై గురిపెట్టిన బీజేపీ(BJP) ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మేడ్చల్‌ జిల్లా నాగారంలో సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మూడోసారి మోదీ ప్రధాని కావటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలోకి చేరారు. మల్కాజిగిరిలో అధికార కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు పన్నినా బీజేపీ గెలుపును ఆపలేరని ఈటల స్పష్టం చేశారు.

"కేంద్రంలో మూడోసారి ప్రధాని మోదీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజలందరూ మోదీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుంది. మల్కాజిగిరిలో అధికార కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరు." - ఈటల రాజేందర్‌, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి

DK Aruna fires on CM Revanth : మహబూబ్‌నగర్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమని సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth) ఒప్పుకున్నారని, బీజేపీ నాయకురాలు డీకే అరుణ దుయ్యబట్టారు. దొరసాని అనే మాట మాట్లాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధిచెబుతారని పేర్కొన్నారు.

"మహబూబ్‌నగర్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమని సీఎం రేవంత్‌ రెడ్డి ఒప్పుకున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం రాజకీయాలు చేస్తున్నారు. దొరసాని అనే మాట మాట్లాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ క్షమాపణ చెప్పాలి." - డీకే.అరుణ, మహబూబ్‌నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి

మేనిఫేస్టోలో భాగస్వామ్యం కావాలి : దేశంలో మోదీ(PM MODI) పాలన ప్రపంచానికే దిక్సూచిగా మారిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఇందూరు పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎన్నికల ప్రణాళిక కోసం వివిధ వర్గాలతో అభిప్రాయ సేకరణ చర్చా కార్యక్రమంలో అర్వింద్‌ పాల్గొన్నారు. మేనిఫేస్టో రూపకల్పనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సంఖ్యలో విజయం సాధిస్తుందన్నారు.

ఐటీ పరిశ్రమలు తెస్తా : దేశంలో మూడోసారి ప్రధానిగా మోదీ, భువనగిరి ఎంపీగా బూర గెలుపు ఖాయమని నర్సయ్యగౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. భువనగిరిలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసిన ఆయన, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంటు పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేశారు. మరోసారి ఆశీర్వదిస్తే ఐటీ పరిశ్రమలను తెస్తానని హామీ ఇచ్చారు.

'మేం తలుచుకుంటే 60 మందిని లాగేస్తాం' - కాంగ్రెస్‌ లక్ష్యంగా బీజేపీ నాయకుల విమర్శలు - Lok Sabha Elections 2024

మనసులు గెలిచేలా బీజేపీ మేనిఫెస్టో - సబ్బండ వర్గాలను ఆకట్టుకునేలా రూపకల్పన - lok sabha elections 2024

ABOUT THE AUTHOR

...view details