Telangana BJP Executives Meeting Today :దక్షిణాదిన తెలంగాణను గేట్‌వేగా ఎంచుకున్న బీజేపీ అసెంబ్లీతో పాటు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యేకదృష్టి సారించింది. జాతీయనాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకుసాగుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహాలని తిప్పికొట్టి మంచి ఫలితాలు సాధించింది. 2018లో కేవలం ఒక్క ఎమ్మెల్యేను గెల్చుకున్న కమలదళం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.90శాతం ఓటు బ్యాంకుతోపాటు 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని :ఆ తర్వాత 6 నెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా అధికార పార్టీకి సమానంగా 8 స్థానాలు 35శాతం ఓటింగ్‌శాతాన్ని కైవసంచేసుకొని సత్తాచాటింది. పార్టీకి అనుకూల వాతావరణం ఉండటంతో క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేయాలని యోచిస్తోంది. అదేఊపును త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొనసాగించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కైవసం చేసుకొని పల్లెల్లో పట్టు సాధించేందుకు ప్రణాళిక రచిస్తోంది.
నేడే రాష్ట్ర కార్యవర్గ సమావేశం :అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రకార్యవర్గ సమావేశం జరగ్గా నేడు విస్తృత రాష్ట్రకార్యవర్గ భేటీ నిర్వహిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఆ సమావేశానికి కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ సహా రాష్ట్ర ఇన్ఛార్జ్లు సునీల్‌బన్సల్, తరుణ్‌చుగ్ హాజరుకానున్నారు. ఆ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.
Review On Election Results :కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనప్పటికీ హామీలు అమలుచేయకపోవడంపై సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల్లో అనుసరించే వ్యూహంపైనా మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. సభ్యత్వ నమోదు వేగవంతం, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.