TDP MEMBERSHIP STARTS FROM TOMORROW :ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, నామినేటెడ్ పదవుల భర్తీపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. శనివారం టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 100 రూపాయల సభ్యత్వంతో రూ.5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది.
రెండో దఫా నామినేటెడ్ పదవుల భర్తీ :ఏపీలో రెండో దఫా నామినేటెడ్ పదవుల భర్తీపై ఉదయం నుంచి చంద్రబాబు కసరత్తు చేశారు. సుమారు మూడు గంటల పాటు పదవుల పై ముఖ్యమంత్రి నాయకులతో కసరత్తు చేశారు. సాధ్యమైనంత వరకు రెండో లిస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి ఫేజ్లో ఇచ్చిన 21 నామినేటెడ్ పదవులకు రెట్టింపు సంఖ్యలో ఈ దఫా లిస్ట్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.