TDP Leaders Reaction on Stone Attack on CM Jagan:జగన్‌కు తగిన గాయాలపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్ అంటే ఇంకెక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా అంటోందని ఎద్దేవా చేశారు. జగన్ కొత్తగా ఏదైనా ప్రయత్నించాలంటూ హితవు పలికారు.
Nakka Anand Babu:జగన్‌ది మరో కోడి కత్తి డ్రామా, గత ఎన్నికలకు ముందు కోడి కత్తి డ్రామా ఆడారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. ఫలితంగా ఐదేళ్లు అమాయక దళితుడు జైలులో ఉన్నాడని ఇప్పుడు రాయి డ్రామాకు ఏ దళితుడిని బలి చేస్తారోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఐ ప్యాక్ డైరెక్షన్‌లో ఇంకా ఎన్ని డ్రామాలు చూడాలో అని నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు.
Payyavula Keshav:దున్నపోతు ఈనింది దూడను కట్టేయమన్నట్లుగా వైసీపీ నేతల వ్యవహారం ఉందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జరగని దాడిని జరిగినట్లు ప్రచారం చేసుకుని సానుభూతి కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని, ఇది మరో కోడికత్తి 2.0 తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. ప్రజలు త్వరలో బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
టీడీపీపై పగ - పేదలపై కక్ష - సొంతింటి కలను పాతరేసిన జగన్ సర్కార్ - Jagananna Colonies Problems
Varla Ramaiah:తాడేపల్లి ప్యాలెస్ డైరక్షన్లో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజి సీతారామాంజనేయులు ఆడిన నాటకంలో భాగంగా కోడికత్తి 2.0 కు తెర లేపారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. గతానుభవాల దృష్ట్యా జనం ఇక జగన్ నాటకాలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎన్నికలకు ఖచ్చితంగా 30రోజుల ముందు ఇటువంటి సానుభూతి డ్రామాలు ఆడటం కొత్తకాదని దుయ్యబట్టారు. చైతన్యవంతులైన ప్రజలు కుట్రలను అర్థం చేసుకుని ప్రజాక్షేత్రంలో బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
Vangalapudi Anita:గొడ్డలివేటు, కోడికత్తి నాటకాలు అయిపోయి ఇప్పుడు గులకరాయి దాడి డ్రామాకు జగన్ తెర లేపారని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ప్రజలు కపట నాటకాలను గ్రహించలేనంత అమాయకులు కారన్నారు. వేలాదిమంది పోలీసుల భద్రత మధ్య దాడి జరగడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. నిజంగా దాడి జరిగి ఉంటే సంబంధిత భవనాన్ని చుట్టుముట్టి నిందితుడ్ని పట్టుకోవడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు.