ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఒక ముద్దాయికి మరో ముద్దాయి పరామర్శ- జగన్​ జీవితకాలమంతా జైళ్లకే: టీడీపీ - TDP Leaders Fire On jagan

TDP Leaders Fire On jagan : మాజీ ముఖ్యమంత్రి జగన్​ పిన్నెల్లిని కలవడంపై టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. బాబాయ్ తెల్లవారుజామున 5 గంటలకు చనిపోతే సాయంత్రం ఐదు గంటలకు వెళ్లిన జగన్‌.. పిన్నెల్లి ని మాత్రం చార్టెడ్ ఫ్లైట్లో వెళ్లి పరామర్శించాడని టీడీపీ అధ్యక్షుడు పల్లా మండిపడ్డారు. పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. ఒక రిమాండ్ ఖైదీని.. మరో ముద్దాయి జగన్ రెడ్డి మిలాఖత్ అయ్యారని వర్ల విమర్శించారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 5:19 PM IST

tdp_leaders_fire_on_jagan
tdp_leaders_fire_on_jagan (ETV Bharat)

TDP Leaders Fire On jagan :విశాఖ దస్పల్లా భూములు, క్రిష్టియన్ భూములలో జరిగిన అవకతవకలను బయటికి తీస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గత అధికార పార్టీ భూ కబ్జాలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన క్రిమినల్ ని జగన్ కలవడం సిగ్గుచేటని, గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చరిత్ర జగన్ దని దుయ్యబట్టారు. బాబాయ్ తెల్లవారుజామున 5 గంటలకు చనిపోతే సాయంత్రం ఐదు గంటలకు వెళ్లిన జగన్‌.. పిన్నెల్లి ని మాత్రం చార్టెడ్ ఫ్లైట్లో వెళ్లి పరామర్శించాడని మండిపడ్డారు. జగన్ వ్యవహార శైలి చూశాక 'ఇక మారడు' అని ప్రజలకు అర్థమైందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన 23 రోజుల్లోనే ఏదో అయిపోయినట్టు జగన్ గగ్గోలు పెడుతున్నాడని విమర్శించారు. ఇప్పటికే ప్రజలు తనకు గట్టి బుద్ధి చెప్పారని జగన్ గ్రహించలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు.

పిన్నెల్లిని అన్యాయంగా అరెస్టు చేశారు - జగన్ ఆవేదన - jagan met pinnelli ramakrishna

నెల్లూరులో జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటర్లందరి ముందూ ఈవీఏం ధ్వంసానికి పాల్పడ్డారన్న ఆయన సీసీ కెమెరాల ఫ్యూటేజిలో కూడా ఈవీఏం ధ్వంసం చేసినట్టు బయటపడిందని తెలిపారు. అలాంటి నేరస్థుడైన వ్యక్తిని జగన్ ఎలా వెనకేసుకు వస్తారని ప్రశ్నించారు. అసలు ఆయనకు ప్రజాస్వామ్యం అంటే తెలుసా అని నిలదీశారు. పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిస్టు, చాలామందిని చంపిన వ్యక్తిని వెనకేసుకు వచ్చిన జగన్ నైజం ఏమిటో తెలిసిపోతోందన్నారు. సమయం ముగిసిపోయినా జగన్ కు ములాఖాత్ అవకాశం కల్పించారని అన్నారు. ప్రభుత్వంలో ఇంకా వైఎస్సార్సీపీ వాసనలు పోలేదు త్వరలోనే అన్ని చోట్లా ప్రక్షాళన జరుగుతుందన్నారు. జగన్ ఇక తన సమయాన్ని జైళ్లకు వెళ్లి పలకరింపులకే వెచ్చించాల్సి ఉంటుందని అన్నారు. సజ్జల రెడ్డి, ధనుంజయ్ రెడ్డి లాంటి వారి కోసమే జగన్ ఇక ఓదార్పు యాత్రలు చేయాలని మంత్రి సుభాశ్ వ్యాఖ్యానించారు.

‘అంతా మీరే చేశారు’ - ఓటమిపై వైఎస్సార్సీపీ నేతల మధ్య ఫైట్​ - YSRCP Defeat in 2024 Elections

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్... పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఈవీయం పగులకొట్టాడని జగన్ చెప్పిన సాక్షాన్ని పరిగణలోకి తీసుకొని పిన్నెల్లిని శిక్షించాలని ఆనం కోరారు. నెల్లూరు సంతపేటలో ఆనం, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు జిల్లా అభివృద్ధిపై చర్చించారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ నెల్లూరు జిల్లాకు వచ్చి చంద్రబాబుని విమర్శించడం హాస్యాస్పదమని ఈ సందర్భంగా ఆనం విమర్శించారు. భవిష్యత్ లో వైఎస్సార్సీపీ మనుగడ సాధించలేదని జగన్మోహన్ రెడ్ది చెప్పి వెళ్లారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో భయపడిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛ వచ్చిందని మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరు, కడప జిల్లాల్లోని లే అవుట్లలో అక్రమాలు జరిగాయాన్ని చంద్రబాబు సూచించడంతో విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈస్ట్ గోదావరి తోపాటు ఇతర జిల్లాల్లో టీడీఎస్ బాండల్లో జరిగిన అవినీతిపైన కమిటీ వేశామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సోమశిల జలాశయంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.

40 వేల కోట్లు కొల్లగొట్టిన మనీలాండరింగ్ కేసులో 11 కు పైగా ఛార్జ్ షీట్ లు ఉన్న వ్యక్తి మొన్నటివరకు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం దురదృష్టకరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఒక రిమాండ్ ఖైదీని.. ఎన్నో కేసుల్లో ఛార్జ్ షీట్ లు ఎదురుక్కొంటున్న మరో ముద్దాయి జగన్ రెడ్డి నెల్లూరు జైల్లో మిలాఖత్ అయ్యారని ఆయన విమర్శించారు. ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జిల్లా జైల్లో దాదాపు 22 నిమిషాలు యోగక్షేమాలు మాట్లాడుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ముందు పిన్నెల్లి నేరం ఒప్పుకున్నాడని తెలిపారు. కోర్టులో కాకుండా బయట నేరం ఒప్పుకుంటే ఎగస్ట్రా జుడిషియన్ కన్ఫెషన్ అవుతుంది పిన్నెల్లి అదేచేశాడని అన్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక విద్రోహక శక్తిని మంచివాడు అని చెప్పడం సిగ్గుచేటని వర్లరామయ్య మండిపడ్డారు.

'నిమ్మకాయ నీళ్ల పేరుతో రూ.28 లక్షలు దిగమింగుతావా జగన్- ప్రజాధనం మెక్కడానికి సిగ్గులేదా?' - Nara Lokesh Fires on YS Jagan

ABOUT THE AUTHOR

...view details