TDP Leaders Comments on CM Jagan:అమరావతిని పూర్తి చేయలేని పాలకులు మూడు రాజధానులంటూ రాష్ట్రం పరువు తీశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. 500 రోజులుగా అధర్మంపై పోరాడుతున్న రాజధాని రైతుల ధీరత్వానికి ఉధ్యమాభివందనాలు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల మనోభావాల్ని దెబ్బతీసేలా జగన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రైతుల గొంతు నొక్కేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేయని అరాచకాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పోరాటంలో మరణించిన రైతులకు నివాళులు అర్పించారు. అమరావతి రైతుల ఆశయం త్వరలోనే నెరవేరబోతుందని వెల్లడించారు. జగన్ రెడ్డిని గద్దె దించే రోజు దగ్గర్లోనే ఉందని తెలిపారు.
అవమానాలు, అనిశ్చితికి తెర - ఎంపీ లావు రాజీనామాకు కారణమదే!
Former Minister Dadi Veerabhadra Rao:ప్రజల భూములు దోచుకోవడానికే ఈ తుగ్లక్ చట్టాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. దొంగ చేతికి తాళాలు అప్పగించినట్టు ప్రజల రెవెన్యూ రికార్డులు మొత్తం వైసీపీ నేతలకు అప్పగించేందుకే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టారని విమర్శించారు. న్యాయ వ్యవస్థను కాదని రెవెన్యూ వ్యవస్థకు ఏ విధంగా అధికారం ఇస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖకు అధికారాలు అప్పగిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఏ విధంగా ఉంటుందని నిలదీశారు. న్యాయస్థానాల్లో పరిష్కరించాల్సిన వివాదాలను రెవెన్యూశాఖ పరిష్కరించేలా ఉత్తర్వులు ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని మండిపడ్డారు. ప్రజల ఆస్తులపై, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు వేయడం పిచ్చికి పరాకాష్ట కాదా అని దుయ్యబట్టారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జగన్ సంతకానికే రక్షణ లేదని విమర్శించారు. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ 27/2023ను, జీవో నెం.572ను రద్దు చేసే వరకు పోరాడతామని దాడి వీరభద్రరావు తెలిపారు.