TDP-Janasena joint manifesto : డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంశాన్ని ఉమ్మడి మ్యానిఫెస్టోలో చేర్చేందుకు తెలుగుదేశం - జనసేన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు విజయవాడలోని నోవాటెల్ హోటల్ (Novatel Hotel) లో కీలక భేటీ నిర్వహించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఉమ్మడిగా ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసే అంశంపైనా విస్తృత చర్చ జరుగుతోంది. సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై తెలుగుదేశం - జనసేన నేతలు ఈ భేటీలో స్పష్టతకు రానున్నారు. మేనిఫెస్టో రూపకల్పనపై కీలకాంశాలు ప్రస్తావించారు.
నియోజకవర్గ ఇన్చార్జిలతో పవన్ సమావేశం- పొత్తులు, పోటీపై స్పష్టత!
డ్వాక్రా రుణ మాఫీ హామీ అంశంపై కీలక చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఇరుపార్టీల సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ, మ్యానిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చిస్తున్నారు. వివిధ జిల్లాల్లో తెలుగుదేశం - జనసేన ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ తదితర అంశాలపైనా చర్చ జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల (Yanamala) రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్(Payyavula Kesav), నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య ఉన్నారు. జనసేన కమిటీ సభ్యులుగా ఉన్న నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని పాల్గొన్నారు. వలంటీర్ల వ్యవస్థ కట్టడిపై తెలుగుదేశం - జనసేన కూటమి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.