TDP Celebrations in Andhra Pradesh: ఏపీలో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్ విలవిల్లాడుతుండగా కూటమి ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కూటమి అభ్యర్థులు జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేస్తున్న తరుణంలో జగన్ మినహా మంత్రులంతా ఓటమి బాటలో పయనిస్తున్నారు.
ఉత్తరాంధ్రను కూటమి ఊడ్చేస్తోంది. రాయలసీమలోనూ కూటమి జోరు కొనసాగుతోంది. కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా నడుస్తోంది. రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి దూసుకెళ్తోంది. ఉమ్మడి గోదావరి, దక్షిణ కోస్తాలోనూ సైకిల్ పరుగులు పెడుతోంది. ఒకరిద్దరు మినహా ఓటమి బాటలో మంత్రులు ఉన్నారు. పెద్దిరెడ్డి, రోజా, బుగ్గన, కొడాలి నాని అంబటి, గుడివాడ అమర్నాథ్‌తో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది.