passport seva center in araku valley of alluri sitharama raju district : అల్లూరి జిల్లా వాసులకు ఇకపై పాస్‌పోర్ట్ కష్టాలు తీరనున్నాయి. ఇప్పటివరకు పాస్‌పోర్ట్ కావాలంటే ఇక్కడి నుంచి 120 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి. అరకులోయలోనే పాస్‌పోర్ట్ సేవాకేంద్రాన్ని బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎంపీ తనూజారాణి, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, విశ్వేశ్వరరాజులు ప్రారంభించనున్నారు.
అరకులోయలోని బ్రాంచి పోస్టాఫీస్ ఆవరణలో పాస్‌పోర్ట్ సేవాకేంద్రం సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి రోజూ 50 స్లాట్‌లు అధికారులు అందుబాటులో ఉంచుతారు. గురువారం నుంచి పాస్‌పోర్ట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
దరఖాస్తు ఇలా : పాస్‌పోర్ట్ పొందాలంటే www.passportindia.com వెబ్‌సైట్‌లో స్లాట్‌ని బుక్ చేసుకోవాలి. దరఖాస్తు పొందుపర్చేటప్పుడు అభ్యర్థుల వివరాలు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నాయో వాటినే సమర్పించాలి. పుట్టిన తేదీ ధ్రువపత్రం కోసం పదో తరగతి మార్కుల జాబితా లేకుంటే పాన్‌కార్డ్‌ని ఆన్‌లైన్‌లో సమర్పించాలి. చిరునామా ధ్రువపత్రం కోసం ఆధార్ కార్డుని పొందుపర్చాలి.
పాస్‌పోర్ట్ సర్వర్ డౌన్ - విజయవాడ కేంద్రంలో అంతరాయం - Passport server down
ప్రభుత్వ ఉద్యోగులైతే నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ని సైతం పొందుపరచాల్సి ఉంటుంది. వెబ్సైట్‌లో రెండు రకాల పాస్‌పోర్ట్‌లు అందుబాటులో ఉంటాయి. సాధారణ పాస్‌పోర్ట్, తత్కాల్ పాస్‌పోర్ట్‌లు ఉంటాయి. సాధారణ పాస్‌పోర్ట్ పొందేందుకు పోలీస్ వెరిఫికేషన్ అనంతరం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన దరఖాస్తు : పరిశీలన కోసం పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఆధార్‌కార్డు ఒరిజినల్‌తోపాటు జెరాక్స్‌లు, ఆన్‌లైన్‌లో చెల్లించిన రుసుము రశీదులను వెంట తీసుకురావాలి. మైనర్ అభ్యర్థులైతే సంరక్షకుడికి సంబంధించిన ధ్రువపత్రాలు వెంట తీసుకురావాలి.
Regional Passport Office at Vijayawada: ఏపీకి మరో ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం... ఎక్కడంటే..?