Buddha Venkanna Complaint on Vijayasai Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై తెలుగుదేశం మండిపడింది. విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు గురించి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని సీపీని కోరామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు అన్ని కులాలు అండగా ఉన్నాయని, విజయసాయి రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి స్కాంలో జైలుకు వెళతారని తెలిసే విజయసాయి రెడ్డి ముందుగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని విజయసాయి రెడ్డి విషప్రచారం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని, లేకుంటే కోర్టుకు అయినా వెళ్తానని బుద్దా వెంకన్న తేల్చిచెప్పారు.
"సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసిన విజయసాయిపై కేసు పెట్టాలని కోరాం. విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. జగన్ స్కామ్‌లో జైలుకెళ్తారని తెలిసి విజయసాయి వ్యాఖ్యలు చేశారు. గతంలో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని విషప్రచారం చేశారు". - బుద్దా వెంకన్న,టీడీపీ నేత