ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

డీఎస్పీల బదిలీలు అందుకే - లక్షీశపై మాకు నమ్మకం లేదు : సీఈసీకి అచ్చెన్న లేఖ

TDP Atchannaidu Letter to Election Commission: డీఎస్పీల బదిలీలపై ఈసీకి ఫిర్యాదు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేత అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఎన్నికల్లో వైసీపీకు లబ్ధి చేకూరేలా బదిలీలు జరిగాయని ఆరోపించారు. అదే విధంగా తిరుపతి కలెక్టర్ లక్ష్మీశ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని కలవడంపై సైతం ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ పక్కన పెట్టి ఎమ్మెల్యేను కలెక్టర్ కలవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

TDP_Atchannaidu_Letter_to_Election_Commission
TDP_Atchannaidu_Letter_to_Election_Commission

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 12:41 PM IST

TDP Atchannaidu Letter to Election Commission: డీఎస్పీల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి కలిగేలా బదిలీలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేతలు వారికి అనుకూలంగా ఉండే డీఎస్పీలను కీలక ప్రాంతాల్లో నియమించారంటూ విమర్శించారు. ఈ మేరకు 10 మంది డీఎస్పీల పేర్లను సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

డీఎస్పీలపై అభియోగాలనూ లేఖలో పొందుపరిచారు. మొత్తం 42 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించాలని వారికి డీజీపీ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. తిరుపతి కలెక్టర్ లక్ష్మీశ పై సీఈసీకి అచ్చెన్న మరో లేఖ రాశారు. స్థానిక ఎన్నికలు, తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అక్రమాలకు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

అటువంటి వ్యక్తిని ప్రోటోకాల్ పక్కన పెట్టి కలెక్టర్ కలవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. భూమన కరుణాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కలెక్టర్ సన్మానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతోనే భూమన గెలిచారని, ఈసారి ఆయన కుమారుడు పోటీలో ఉన్నారని వివరించారు.

మాకు ఆమెపై నమ్మకం లేదు: ఈ పరిస్థితుల్లో కలెక్టర్ లక్ష్మీశ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారనే నమ్మకం లేదన్నారు. అందువల్ల తిరుపతి కలెక్టర్ బదిలీ చేసి, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి ప్రతిపక్షాలను వేధిస్తూ, వైసీపీకు అనూకులంగా వ్యవహరిస్తున్నారని సీఈసీకి ఇంకో లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలతో పరమేశ్వర్‌రెడ్డికి ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టాలని కోరారు.

వైఎస్సార్సీపీ నేతల అక్రమాలకు సలాం కొట్టి ఉన్నత పదవి పట్టేశారు!

మండిపడుతున్న ప్రతిపక్షాలు: మరోవైపు డీఎస్సీల బదిలీల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందనే విమర్శలు సైతం వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వంలోనూ, వైసీపీలోనూ అగ్ర ప్రాధాన్యం పొందుతున్న ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన అధికారులకే ఎక్కువగా పోస్టుల్లో ప్రాధాన్యమిచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు.

కీలక బాధ్యతలు వారికే: మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీటి నిర్వహణలో శాంతిభద్రతల పరంగా కీలక బాధ్యతలు నిర్వర్తించేది ఎస్‌డీపీవోలు. అందుకే తమకు అనుకూలమైన సామాజిక వర్గానికి చెందిన వారిని, తమ అరాచకాలను చూసీ చూడనట్లు ఉండేవారిని, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడతారనే గుర్తింపు కలిగిన అధికారులకు ప్రభుత్వం కీలక పోస్టింగులిచ్చిందని విపక్షాలు మండిపడుతున్నాయి. వివాదాస్పద అధికారులుగా పేరొందిన పలువురికి బదిలీల్లో ప్రాధాన్యం కల్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో వీరిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

పోస్టింగుల్లో ఒకే సామాజిక వర్గానికే పెద్దపీట - 104 మంది డీఎస్పీలు బదిలీ

ABOUT THE AUTHOR

...view details