తెలంగాణ

telangana

ETV Bharat / politics

రణరంగంగా తాడిపత్రి - రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి - High Tension in Tadipatri - HIGH TENSION IN TADIPATRI

High Tension in Tadipatri 2024 : ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిని వైఎస్సార్సీపీ మూకలు యుద్ధభూమిగా మార్చాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు లక్ష్యంగా చేసుకోవడం, పసుపు దళం సైతం వైసీపీ నేతలపై తిరగబడడంతో రోజంతా ఉద్రిక్తతలు రాజేశాయి. గొడవలకు కారణమైన పెద్దారెడ్డిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. తెల్లవారుజామున జేసీ కార్యాలయంలో పనిచేసే దివ్యాంగుడు కిరణ్‌ను పోలీసులు చితకబాదారు. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

High Tension in Tadipatri 2024
High Tension in Tadipatri 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 10:26 AM IST

రణరంగంగా తాడిపత్రి రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తరలింపు (ETV Bharat)

YCP Attack on TDP Leaders in Tadipatri at Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్‌లోనిఅనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. పోలింగ్‌ రోజునే తనలోనే నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. టీడీపీ ఏజెంట్లపై దాడులకు తెగబడి భయాందోళన సృష్టించాడు. అంతటితో ఊరుకోక మంగళవారం సైతం తాడిపత్రిలో యుద్ధ వాతావరణాన్ని తలపించేలా అందర్నీ భయకంపితులను చేశాడు.

Attacks Continue in Tadipatri 2024 : పట్టణంలో తన వాహన శ్రేణితో వేగంగా తిరుగుతూ అరాచకత్వానికి నిలువుటద్దంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి నిలిచాడు. ఇదంతా చూస్తున్న జనం భయంతో వణికిపోవడం కనిపించింది. ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకొని రోజంతా గడాల్సిన దుస్థితి ఏర్పడింది. పోలీసులు సైతం ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. ఏఎస్పీ లాంటి అధికారినే దుర్భాషలాడిన పెద్దారెడ్డిని అదుపు చేసేవారే లేరా? అన్న ప్రశ్న పట్టణవాసుల్లో మెదిలింది.

రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు :తాడిపత్రిలో పోలింగ్‌ రోజు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి వాహనంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఈ దాడుల్ని ప్రతిఘటించిన టీడీపీ నేత సుర్యముని ఇంటికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. కులం పేరుతో దూషించారు. అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో తాడిపత్రి సీఐ మురళీకృష్ణకు గాయమైంది.

ఓటరుపై దాడి ఘటన - తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై కేసు - CASE BOOKED ON TENALI MLA IN AP

Kethireddy Pedda Reddy VS JC Prabhakar Reddy :ఈ దాడి గురించి తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి, తన అనుచరులతో సూర్యముని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన వారితో కలిసి సూర్యముని ఇంటి నుంచి పోలీస్‌స్టేషన్‌కి ర్యాలీగా వెళ్లారు. ఠాణా ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఓవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆందోళన కొనసాగుతుండగానే తెలుగుదేశం శ్రేణులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపునకు దూసుకెళ్లేందుకు యత్నించారు.

ఈ క్రమంలో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల మధ్య ఉన్న జూనియర్ కళాశాల మైదానంలో ఇరువర్గాలూ పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. పెద్దారెడ్డి ఇంటిపైకి ఎక్కిన వైఎస్సార్సీపీ మూకలు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. ఒకరిపై ఒకరు బాణసంచా పేల్చుకున్నారు. చివరకు కేంద్ర బలగాలు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే అరాచకాలు సృష్టిస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.

తాడిపత్రిలో భారీగా పోలీసుల మోహరింపు : మంగళవారం రాత్రి పెద్దారెడ్డి సోదరుడి కుమారుడు, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన అనుచరులతో తాడిపత్రికి వచ్చారు. అయితే ఎస్పీ సూచన మేరకు తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘర్షణలకు కారణమైన ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలతో తాడిపత్రిలో పోలీసుల భారీగా మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి డీఎస్పీలను రప్పించి భద్రత ఏర్పాటు చేశారు.

AP Elections violence 2024 :తెల్లవారుజామున జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. మరోవైపు జేసీ కార్యాలయంలో పనిచేసే దివ్యాంగుడు కిరణ్‌ను పోలీసులు చితకబాదారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సిఫార్సు చేశారు.

వైఎస్సార్సీపీ దమనకాండ - పులివర్తి నానిపై హత్యాయత్నం - కారంపూడి, తాడిపత్రిలోనూ విధ్వంసం - AP Elections 2024

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి - పద్మావతి యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత - Attack on Pulivarthi Nani in Tpty

ABOUT THE AUTHOR

...view details