ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రాష్ట్రంలో ఎన్నికల కోడ్- వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనే వీల్లేదు : CEO - loksabha Elections

CEO of the State is Mukesh Kumar Meena : కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఏపీ లో పోలింగ్ మే 13 తేదీన జరుగుతుందని, నోటిఫికేషన్ ఏప్రిల్ 18 తేదీన విడుదల అవుతుందన్నారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 6:53 PM IST

CEO of the State is Mukesh Kumar Meena : కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఏపీ లో పోలింగ్ మే 13 తేదీన జరుగుతుందని, నోటిఫికేషన్ ఏప్రిల్ 18 తేదీన విడుదల అవుతుందన్నారు. ఇవాల్టికి ఏపి లో 4.09 కోట్ల మంది ఓటర్లు నమోదు అయ్యారని తెలిపారు. తుది ఓటర్ల జాబితా నాటికి 4.07 కోట్ల మంది ఉన్నారని వివరించారు. కొత్తగా ఈ నెలన్నర రోజుల్లో 1.75 లక్షల మంది వచ్చారన్నారు. ఇవాళ్టి నుంచి కొత్త దరఖాస్తులు, తొలగింపు దరఖాస్తులు ఫ్రీజ్ చేస్తున్నట్లు తేల్చిచెప్పారు. అయితే నోటిఫికేషన్ విడుదల కు 10 రోజుల వరకూ ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. ఏపి లో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఉన్నాయన్నారు. అత్యవసరం గా మరికొన్ని పోలింగ్ కేంద్రాలు ప్రత్యామ్నాయం గా పెడుతున్నామని వివరించారు.

దేశంలో మోగిన ఎన్నికల నగారా- 7విడతల్లో సార్వత్రిక పోరు- పోలింగ్, కౌంటింగ్ తేదీలివే

ఈసారి మహిళా సిబ్బంది మాత్రమే ఉన్న 179 పోలింగ్ కేంద్రాలు , యువ సిబ్బంది ఉన్న 50, మోడల్ పోలింగ్ కేంద్రాలు 555 ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎపిక్ కార్డు తో పాటు 12 రకాల గుర్తింపు కార్డులు వినియోగించుకోవచ్చునని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. 85 ఏళ్లు నిండిన ఓటర్ లకు ఇంటి నుంచే ఓటు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. నోటిఫికేషన్ వచ్చాక రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. దాన్ని పోస్టల్ బ్యాలెట్ గా గుర్తిస్తూ నిర్ణయించమన్నారు. 10 రోజుల ముందే ఓటు చేసేలా చర్యలు ఉంటాయన్నారు. ఈసారి అన్ లైన్ నామినేషన్ అవకాశం కల్పిస్తున్నమన్నారు. అఫిడవిట్ లో ఎలాంటి ఖాళీ లేకుండా పూర్తి చేసి ఇవ్వాల్సిందేనన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు మూడు మార్లు పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సిందేనన్నారు. వాలంటీర్ లు ఎక్కడా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వీల్లేదని, సచివాలయం ఉద్యోగుల్లో ఒకరిని ఎన్నికల విధుల్లో వాడుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. కేవలం వారిని ఇంకు వేసేందుకు మాత్రమే వినియోగిస్తామన్నారు. ఇప్పటికే ఈసీఐ దీనిపై మార్గదర్శకాలు జారీ చేసిందని ఈసీ స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు లేకుండా ఏపిలో ఎన్నికలే జరగవు అని చెప్పారు.

వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితా వెల్లడి

ఎన్నికల షెడ్యూలు ప్రకటన కంటే ముందు నుంచే రాష్ట్రంలోకి వచ్చే రహదారుల్లో చెక్ పోస్టులు పెట్టామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. ఇప్పటి వరకూ 164 కోట్ల విలువైన నగదు, వస్తువులు, డ్రగ్స్, మద్యం సీజ్ చేశామని తెలిపారు. ఉచితాలు, నగదు తరలింపు కోసం అన్ని కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల తో నిఘా పెట్టామన్నారు. హెలికాప్టర్లు, విమానాల ద్వారా తరలించేందుకు అవకాశం లేకుండా తనిఖీలు కూడా చేస్తున్నామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లు కూడా ఏర్పాటు చేశామని మీనా వివరించారు. ఈసారి ఎన్నికలకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈసారి బందోబస్తు కోసం 1,14,950 మంది సివిల్ పోలీసులు, 58 కంపెనీల పారామిలటరీ బలగాలు ,465 కంపెనీల సాయుధ బలగాలు అవసరం అవుతారని మీనా స్పష్టం చేశారు. ఏపి కి 2 లక్షల ఈవీఎం యంత్రాలను ఈసీఐ కేటాయించిందని వెల్లడించారు.

ఎన్నికల షెడ్యూల్ రాకతో ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది - వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది: చంద్రబాబు

బందోబస్తు కోసం 2,18,515 మంది పోలీసు సిబ్బంది అవసరం అవుతారని పోలీసు ఎన్నికల నోడల్ అధికారి శంకబ్రత బాఘ్చి స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు, ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులు, కేంద్ర బలగాలు, ఎక్స్ సర్వీస్ మెన్ ను కూడా నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏపి లో 121 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇంకా చాలా అవసరం అవుతాయన్నారు. ఓటర్ల ను మభ్య పెట్టేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకునెలా చర్యలు ఉంటాయని, ఊచితాలు, నగదు, మద్యం తదితర అంశాలను అడ్డుకునేలా నిఘా పెడుతున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్​లో మే 13న పోలింగ్- జూన్ 4న ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details