Secunderabad BRS Candidate Padmarao Goud on Elections : తెలంగాణ ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిన తమకు పార్లమెంట్ ఎన్నికలు లెక్క కాదని, విజయం సాధిస్తున్నామని సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యేపద్మారావు గౌడ్ అన్నారు. తమ పార్టీకి ఉద్యమాలు, పోరాటాలకు కొత్త కాదన్న ఆయన, ప్రజావ్యతిరేక కాంగ్రెస్ విధానాలపై పోరాడతామని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్(BRS) హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసిందని వివరించారు.
Padmarao Goud Fires on BJP :కిషన్రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకురాలేదని అన్నారు. బీజేపీకి రామునిపై పట్టా లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వెంట ఉండి ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుని తెలంగాణను సాధించుకున్నామని గుర్తుచేశారు. ఎన్నికల్లో బీసీలకు బీఆర్ఎస్ (BRS Focus on Lok Sabha Polls) అధికంగా అవకాశం ఇచ్చిందని, బీసీలు ఎన్నికల్లో కొట్లాడతారా అని అనుమానపడే వాళ్లకు ఈ ఎన్నికల్లో గెలిచి సమాధానం ఇవ్వాలని పద్మారావు కోరారు.
లోక్సభ ఎన్నికలయ్యాక రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయం : కేటీఆర్ - ktr fires on revanth reddy
'పార్టీకి ఉద్యమాలు, పోరాటాలు కొత్తకాదు, కాంగ్రెస్ విధానాలపై పోరాడుతాం. పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఏ కష్టం కలిగినా అందుబాటులో ఉంటాం. ఈ ఐదేళ్లు ప్రతిపక్షంగా ఉండి ప్రజల తరఫున పోరాడుతాం. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకురాలేదు. మేమందరం హిందువులమే. కేవలం బీజేపీనే హిందువులం అన్నట్లు చెప్పుకుంటుంది.' అని పద్మారావు ఎద్దేవా చేశారు.