తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ - మే 6న తీర్పు వెల్లడిస్తామన్న ధర్మాసనం - Kavitha ED Bail Petition Updates - KAVITHA ED BAIL PETITION UPDATES

Kavitha Bail Petition Updates : ఈడీ కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత బెయిల్​ పిటిషన్​పై దిల్లీలోని రౌస్​ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మే 6న తీర్పు వెల్లడిస్తానని స్పష్టం చేసింది.​

Delhi liquor case
Kavitha Bail Petition Updates

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 4:43 PM IST

Updated : Apr 24, 2024, 5:09 PM IST

BRS MLC Kavitha ED Bail Petition Updates : దిల్లీ మద్యం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు గత నెల 15న అరెస్ట్​ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిహాడ్​ జైలులో ఉన్న ఆమె, తనకు బెయిల్​ మంజూరు చేయాల్సిందిగా రౌస్​ అవెన్యూ కోర్టులో గతంలో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై నేడు మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ తరఫున న్యాయవాది జోయబ్​ హుస్సేన్ సుదీర్ఘ​ వాదనలు వినిపించారు.

Delhi Liquor Case Updates : మనీలాండరింగ్ కేసులో అనేక మంది నిందితులకు బెయిల్‌ రాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మనీష్ సిసోదియా బెయిల్ పిటిషన్‌ను అన్ని కోర్టులు తిరస్కరించాయని, తప్పు జరిగినట్లుగా సుప్రీంకోర్టు సైతం నిర్ధారించిందని తెలిపారు. మద్యం వ్యాపారం కోసం శ్రీనివాసులు రెడ్డి కేజ్రీవాల్‌ను కలిశారని, కవితను కలవమని కేజ్రీవాల్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెప్పారని ధర్మాసనానికి వెల్లడించారు. శ్రీనివాసులు రెడ్డి కవితను హైదరాబాద్‌లో కలిశారని, కేజ్రీవాల్ రూ.100 కోట్లు అడిగారని కవిత శ్రీనివాసులు రెడ్డికి చెప్పారని వివరించారు. రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత శ్రీనివాసులు రెడ్డిని కోరారని స్పష్టం చేశారు.

దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు - kavitha Judicial Custody Extended

కవితకు 33 శాతం వాటా : మరోవైపు అభిషేక్, బుచ్చిబాబుకు రాఘవ రూ.25 కోట్లు ఇచ్చారని, ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్స్‌లో కవిత భాగస్వామ్యం పొందారని జోయబ్​ హుస్సేన్​ పేర్కొన్నారు. వ్యాపారంలో కవితకు 33 శాతం వాటా కోసం బుచ్చిబాబు పని చేశారని వెల్లడించారు. బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సప్ చాట్స్‌లో ఆధారాలున్నాయన్న ఆయన, కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారని తెలిపారు. అప్రూవర్లను అనుమానించడం కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టడమేనన్న ఈడీ తరఫు న్యాయవాది, కవితకు నోటీసులిచ్చాకే పిళ్లై స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. కవిత ఒత్తిడితోనే అరుణ్ పిళ్లై వెనకడుగు వేశాడని ఆరోపించారు.

కవిత సీబీఐ బెయిల్ పిటిషన్‌పై మే 2న తుది ఉత్తర్వులు - KAVITHA BAIL PETITION HEARING

ఫోన్లన్నీ ఫార్మాట్​ చేసి ఇచ్చారు : మరోవైపు కవిత తన ఫోన్లలో సమాచారం డిలిట్ చేశారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆమె ఇచ్చిన 10 ఫోన్లనూ ఫార్మాట్ చేసి ఇచ్చారని, సమాచారం తొలగించడంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని పేర్కొంది. కవిత సాక్ష్యాలు ధ్వంసం చేశారని, సాక్షులను బెదిరించారని ఆరోపిస్తూ వాదనలను ముగించారు. అయితే ఈడీ వాదనలపై రిజాయిన్డర్ లిఖితపూర్వకంగా ఇస్తామని కవిత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్‌పై మే 6న తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

'కవిత విచారణకు సహకరించలేదు - తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారు' - delhi liquor scam case updates

Last Updated : Apr 24, 2024, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details