కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసి ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddy Election Campaign in Adilabad : కాంగ్రెస్ హయాంలోనే కుప్టి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ఆ జిల్లాలో జరిగిన ‘జన జాతర’ సభలో ఆయన పాల్గొన్నారు. డప్పు వాయించి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. తుమ్మిడిహట్టిలో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కడతామని, ఆదిలాబాద్‌లో కొత్తగా విశ్వవిద్యాలయం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. నాగోబా జాతరకు రూ.4 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
భువనగిరి కోట కాంగ్రెస్ కంచుకోటగా మరోసారి నిరూపించాలి : రేవంత్ రెడ్డి - CM Revanth Election Campaign
Revanth Reddy Speech at Adilabad : కాంగ్రెస్ హయాంలో ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమను నిర్మించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం కేసీఆర్ కలిసి సీసీఐ పరిశ్రమను మూసివేశారని ఆరోపించారు. త్వరలో ఆ పరిశ్రమను తెరిపిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 అమలు చేశామని తెలిపారు. త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గుర్తు చేశారు. పేదల ఇంట్లో వెలుగులు చూసి మోదీ, కేసీఆర్ కడుపు మండుతుందని విమర్శించారు. నిధులన్నింటినీ మోదీ గుజరాత్‌కు తరలిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రచారంలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి - నేడు భువనగిరిలో పర్యటన - CM Revanth Campaign in Bhuvanagiri
Congress Jana Jathara Meeting in Adilabad: కేసీఆర్ హయాంలో ఎవరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ మాత్రం వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌజ్ కట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ, కేసీఆర్ విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు తమకు అధికారం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పదేళ్లలో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకుంటే, కాంగ్రెస్ 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. బీసీ జనగణన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించాం. ఇప్పటి వరకు 35 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభించారు. కేసీఆర్ ప్రభుత్వం రాగానే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని రద్దు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మోదీ, కేసీఆర్ అంటున్నారు." - రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
Revanth Reddy Comments on PM Modi: మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌లో ఒక దొంగను ఓడగొట్టామని అన్నారు. పేదలకు అండగా నిలబడిన వారికి కాంగ్రెస్‌లో అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. మోదీ, కేసీఆర్ వచ్చాక గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 అయిందని, కాంగ్రెస్ హయాంలో రూ.400కే గ్యాస్ సిలిండర్ అందించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.500కే సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు.
బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి - నేడు ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరిలో ప్రచారం - REVANTH ELECTION CAMPAIGN SCHEDULE
నమో అంటేనే 'నమ్మించి మోసం' చేయడం - కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ - REVANTH SLAMS MODI IN BENGALURU