తెలంగాణ

telangana

ETV Bharat / politics

'తుక్కుగూడ సభ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది' - ఎక్స్‌ వేదికగా రాహుల్‌ గాంధీ ట్వీట్ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

Rahul Gandhi Tweet on Tukkuguda Jana Jatara Sabha : తుక్కుగూడ సభపై ఎక్స్‌ వేదికగా రాహుల్‌ గాంధీ స్పందించారు. తుక్కుగూడ సభ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. చాలా మంది జనం హాజరైన సభలో మేనిఫెస్టో విడుదల చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

Rahul Gandhi Tweet on Tukkuguda Jana Jatara Sabha
Rahul Gandhi Tweet on Tukkuguda Jana Jatara Sabha

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 4:52 PM IST

Updated : Apr 7, 2024, 6:17 PM IST

Rahul Gandhi Tweet on Tukkuguda Jana Jatara Sabha : శనివారం సాయంత్రం నిర్వహించిన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సభ తనకు సంతోషాన్ని ఇచ్చిందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా వీడియో విడుదల చేశారు. చాలా మంది జనం హాజరైన సభలో మేనిఫెస్టో(Congress Manifesto) విడుదల చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రజల గళమని, మేనిఫెస్టోకి సంబంధించి తమ తమ అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకోవాలని సూచించారు. హ్యాష్‌ట్యాగ్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టో(#CongressManifesto) పేరిట పంచుకోవాలని కోరారు.

తుక్కుగూడ సభ సక్సెస్‌ : పార్లమెంటు ఎన్నికలో అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారం చేజెక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో హస్తం పార్టీ ఐదు గ్యారంటీల(Congress Five Guarantees) పేరుతో జనంలోకి వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తదితరులు జాతీయ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను తెలంగాణ రాష్ట్రం వేదికగా విడుదల చేయాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల దిల్లీలోని విడుదల చేశారు.

కేసీఆర్‌ పొగరు వల్లే బీఆర్‌ఎస్‌ పార్టీ 104 ఎమ్మెల్యేల నుంచి 39కి చేరుకుంది : మంత్రి ఉత్తమ్‌

Congress Jana Jatara Sabha :అయితే ముందు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో సభ నిర్వహించి అక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించాలని భావించింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈనెల 6వ తేదీనజన జాతర సభ(Jana Jatara Sabha) పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 10 లక్షల మంది హాజరైన జన జాతర సభలో కాంగ్రెస్‌ జాతీయ మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేశారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్లమెంటు అభ్యర్థులుగా ప్రకటించిన వారితో రాహుల్‌ గాంధీ ఫోటోకు ఫోజు ఇచ్చారు.

ఫోన్ల ట్యాపింగ్‌పై రాహుల్‌ గాంధీ కామెంట్స్‌ - 'అప్పుడు కేసీఆర్‌ చేసిందే ఇప్పుడు మోదీ చేస్తున్నారు'

తుక్కుగూడ సభకు అనూహ్య స్పందన - కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్​ - 14 సీట్లకు ఇక ఢోకా లేదు!

Last Updated : Apr 7, 2024, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details