Prime Minister Narendra Modi to Attend TDP JanaSena Meeting : ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తు పొడిచి వేళ రాష్ట్రరాజకీయ ముఖచిత్రం మారుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ లు పోటీ చేసే సీట్లపై దాదాపు కొలిక్కి వేచ్చిన వేళ, పార్టీల అధినేతలు ప్రచారంపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి, పొత్తులపై పార్టీ శ్రేణులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు, త్వరలో రాష్ట్రంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారనే సంకేతాలను ఇచ్చారు. ఈ నెల్లో టీడీపీ, జనసేన నిర్వహించే భారీ బహిరంగ సభకు మోదీ హాజరు కానున్నారని స్పష్టం చేశారు. మోదీ పాల్గొనే సభకు ఒక రోజు అటు ఇటు అయినా అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని బాబు సూచించారు. ఈ మేరకు 17 లేదా 18 తేదీల్లో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మూడు పార్టీలు కలిసి ఈ నెలలోనే ప్రచారం ప్రారంభిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను బీజేపీ, జనసేనలకు ఇస్తున్నట్లు నేతలతో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు, పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : బీజేపీ
సీట్ల సర్దుబాటుపై చర్చలు :ఐదు సంవత్సరాలల్లో సీఎం జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరమని చంద్రబాబుతెలిపారు. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవడానికి కేంద్రంతో కలిసి ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నామని, పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడొద్దని అన్నారు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలని తెలిపారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయని, స్పష్టత వచ్చిందని అన్నారు. పోటీ చేసే స్థానాలపై మరో సమావేశం తర్వాత నిర్ణయం ఉంటుందని, తమ మధ్య ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు.