ETV Bharat / state

'ఈ మాల ధరిస్తే మీ జీవితంలో వెలుగులు - మీపై మంత్రాలు కూడా పనిచేయవట!' - KARUNGALI MALA BENEFITS

కరుంగలి మాలతో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయంటున్న జ్యోతిష్య ప్రముఖులు

karungali_mala_benefits
karungali_mala_benefits (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2025, 12:58 PM IST

karungali mala benefits : జపమాలికల్లో కరుంగలి (కరుంగి) అద్భుత ఫలితాలు ఇస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. కనీవిని ఎరుగని అద్భుతాలను అందించే మహత్తర సుగుణాలు ఈ జపమాలికకు ఉన్నాయని ఆయన వెల్లడించారు. తులసి, పద్మ, స్పటిక లాంటి ఎన్నో మాలలు, జపమాలలు ఉన్నా కరుంగలికి ఎంతో విశిష్టత ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరుంగలి మాల విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

ఆధునిక కాలంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది కరుంగలి మాల ధరిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాజకీయ నేతలు, ప్రముఖ సినీ హీరోలు ఈ మాల ధరించడంతో జన బాహుళ్యంలోకి వచ్చింది. తమిళ్ హీరో ధనుష్ కరుంగలి జపమాలికను ధరించినట్లు వార్తలు రావడంతో అందరి దృష్టి ఈ మాలపై పడింది.

నమ్మకంతో కరుంగలి మాల ధరిస్తే అద్భుత విజయాలు సాధించడమే ఇందులో దాగిన ప్రత్యేకతగా మాచిరాజు అభివర్ణించారు. కరుంగాళి అనే పేరున్న చెట్టు బెరడు నుంచి తయారైన మాలికలు జపానికన్నా ధరిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.

కాశీ వెళ్లానుకునే వారికి ఇదే మంచి అవకాశం - IRCTC మహా కుంభమేళా ప్యాకేజీ

ఫలితాలు ఇలా

జాతకాల్లో ప్రధానమైన కుజ గ్రహ దోషాలు తొలగిపోవాలంటే కరుంగలి మాల ధరించాలని మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. కుజుడి బలం, సొంతింటి కల, ల్యాండ్ వివాదాలు, కోర్టు, పోలీస్ కేసులు, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విజయాలు అందుకోవాలన్నా, కోట్ల అప్పులు తీరిపోయి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న కరుంగలి మాల అద్భుతంగా పనిచేస్తుందన్నారు.

కరుంగలి మాల అధిష్ఠాన దైవం కుజుడు కాబట్టి అన్ని సమస్యలు తీరిపోతాయని, ప్రాపర్టీ కొన్నాలన్నా, అమ్మాలన్నా సకాలంతోనే సాధ్యమవుతుందని చెప్పారు.

తాంత్రిక మాలిక కావడం వల్ల కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ నుంచి వచ్చే రేడియేషన్ పోగొడుతుందని, ఎవరికీ కూడా బ్లాక్ మ్యాజిక్ పని చేయనివ్వకుండా ఉంటుందని, ఇంటిపైనా బ్లాక్ మ్యాజిక్ పని చేయవని వెల్లడించారు. 12 జాతక చక్రాల్లో 6వది అయిన కర్మ స్థాన ఫలితాలు బాగుంటాయని చెప్పారు. ఈ స్థానాధిపతి ఇబ్బందిగా ఉండడం వల్ల ఎంత కష్టపడ్డా ఎదుగుదల లేకపోవడం, సత్ఫలితాలు రాకపోవడం జరుగుతుందని, అందుకే కరుంగలి మాల పూర్వ జన్మ ఫలితాల తీవ్రతను తగ్గిస్తుందని తెలిపారు. మిళనాడులోని పాతాళ శంభు మురుగన్ ఆలయంలో కరుంగలి మాలిక లభిస్తుంది. ఈ మాల ప్రస్తుతం ఆన్​లైన్ లో ట్రెండింగ్ లో ఉంది. ఎంతో మంది ప్రముఖులు దీనిని ధరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

కరుంగలి మాలను ధరించాలంటే కొన్ని నియమాలు పాటించాలని మాచిరాజు సూచిస్తున్నారు. ప్రధానంగా శుచిగా ఉండాలని, మాంసాహారం తీసుకోవద్దని స్పష్టం చేశారు. మద్యపానానికి దూరంగా ఉండడంతో పాటు మైల ప్రదేశాలకు వెళ్లొద్దని చెప్పారు. మాల ధారణకు ముందుగా ఇంటిని ఆవు పంచకంతో శుద్ధి చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. కరుంగలి మాల కొనుగోలు చేసిన తర్వాత 21 లేదా 41 లేదా 108 రోజులు పూజగదిలో ఉంచి ఎరుపురంగు పూలతో అలంకరించి 'స్కంధాయ నమః' అంటూ 108 సార్లు పఠించాల్సి ఉంటుంది. ఇక బుధ, గురు, శుక్ర, శని వారాల్లో, పంచమి, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో ధరిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని వెల్లడించారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఈ నెల 9, 10న ముక్కోటి ఏకాదశి - వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలంటే!

దక్షిణ మధ్య రైల్వే బంపర్​ ఆఫర్ - సంక్రాంతికి మరో 52 ప్రత్యేక రైళ్లు! - బుకింగ్ ఓపెన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.