తెలంగాణ

telangana

ETV Bharat / politics

శంషాబాద్‌లో బీజేపీ విస్తృత కార్యవర్గ సమావేశం - 15 అంశాలతో రాజకీయ తీర్మానాలు - BJP state wide executive meeting - BJP STATE WIDE EXECUTIVE MEETING

Resolutions of BJP state wide executive meeting : శంషాబాద్‌లో నేడు నిర్వహించిన బీజేపీ విస్తృత కార్యవర్గ సమావేశంలో 15 అంశాలతో రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీర్మానాలను ప్రవేశపెట్టగా, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌ రావులు బలపర్చారు.

Resolutions of BJP state wide executive meeting
Resolutions of BJP state wide executive meeting (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 5:27 PM IST

BJP State Wide Executive Meeting Resolutions : హైదరాబాద్ శంషాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర పదాధికారులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 15 అంశాలతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి రాజకీయ తీర్మానాలను ప్రవేశ పెట్టగా, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు తీర్మానాన్ని బలపర్చారు. అంతకు ముందు బీజేపీకి ఓట్లు, సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు నేతలు సెల్యూట్ చేశారు. కేసీఆర్‌ నియంతృత్వ, నిరంకుశ పాలనపై సుదీర్ఘ పోరాటం చేసినట్లు గుర్తు చేసుకున్నారు.

రాజకీయ తీర్మానంలోని 15 అంశాలు

1. రుణమాఫీ వాయిదా

ఆగస్టు 15లోపు రుణ మాఫీ చేస్తామని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోంది. వెంటనే రుణమాఫీ అమలు చేయాలి.

2. రైతు భరోసా ఏదీ?

రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు వెంటనే విడుదల చేయాలి

3. విద్యార్థి యువ వికాసం గ్యారంటీ

4. క్షీణించిన శాంతి భద్రతలు

5. గ్రామ పంచాయతీలకు గ్రహణం

a) గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలి

b) గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి

6. ధరణి ప్రక్షాళన ఎప్పుడు..?

7. పునాది పడని ఇందిరమ్మ ఇండ్లు

8. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి

కాళేశ్వరం వ్యవహారాన్ని సీబీఐకి అప్పజెప్పాలి

9) ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు

ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీబీఐకి అప్పగించాలి

ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న శక్తులను గుర్తించి, శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి

10) విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి

విద్యుత్ కొనుగోలు అంశంలో జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేయాలి

11) ధాన్యం కుంభకోణం

12) గొర్రెల పంపిణీ స్కామ్

గొర్రెల స్కామ్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అసలైన అవినీతిపరులను గుర్తించి, శిక్ష పడేలా చర్యలు చేపట్టాలి.

వాక్స్, ల్యాండ్, శాండ్, గ్రానైట్, లిక్కర్, డ్రగ్స్ మాఫియాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి

13) రేషన్ కార్డులు

14) ఆయుష్మాన్ భారత్

15) ఫీజు రీయింబర్స్‌మెంట్

సీఎం ఇలాకాలో కాషాయ జెండా రెపరెపలు - పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజాగ్రహం : కిషన్ రెడ్డి - Kishan Reddy On Lok Sabha Result

ABOUT THE AUTHOR

...view details