తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఉమ్మడి మహబూబ్‌నగర్​లో ఎలక్షన్ హీట్ - అభ్యర్థులకు మద్దతుగా జాతీయ నాయకుల ప్రచారం - Election Campaign In Mahabubnagar

Political War in Mahabubnagar 2024 : ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రచారాలతో హోరెత్తుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించగా, రేపు ప్రియాంక గాంధీ షాద్​నగర్​లో పర్యటించనున్నారు. బీజేపీ సైతం ప్రచారంలో దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రధాని మోదీ నాగర్​కర్నూల్ బహిరంగ సభకు వచ్చి వెళ్లారు. రేపు మహబూబ్​నగర్ లోకసభ నియోజకవర్గ పరిధిలోని నారాయణపేటలో జరిగే బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. ఇక బీఆర్ఎస్ తరపున ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హారీశ్ రావు కార్నర్ మీటింగ్​ల్లో పాల్గొన్నారు.

Mahabubnagar Lok Sabha Elections 2024
Political War in Mahabubnagar 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 12:58 PM IST

Mahabubnagar Lok Sabha Elections 2024 : పోలింగ్​కు సమయం దగ్గర పడుతుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లా అగ్రనేతల పర్యటనలు, క్షేత్రస్థాయి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలోని నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతోంది. మహబూబ్​నగర్​ కాంగ్రెస్ అభ్యర్ధి చల్లా వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్ధి మల్లురవి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు రెండు నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈనెల 10న పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ రోడ్‌షో, కార్నర్ మీటింగ్​లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ నెల 10న మక్తల్‌లో పర్యటించనున్నారు. ఉమ్మడి పాలమూరు అభివృద్ధి కావాలంటే మహబూబ్​నగర్, నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని రేవంత్‌రెడ్డి పదేపదే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉమ్మడి పాలమూరులో వాళ్లే కింగ్​ మేకర్లు- అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న మహిళా ఓటర్లు - MAHABUBNAGAR LOK SABHA VOTERS 2024

BJP Election Campaign In Mahabubnagar : బీజేపీ సైతం ప్రచారంలో దూకుడు పెంచింది. మహబూబ్​నగర్ బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ, నాగర్ కర్నూల్ అభ్యర్ధి భరత్ ప్రసాద్ ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను దాదాపుగా చుట్టి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ముఖ్యనేతలు ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఈ నెల 10న నారాయణపేటలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. తర్వాత ఈ నెల 11న వనపర్తిలో జరిగే బీజేపీ ప్రచార సభకు హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కరపత్రాల రూపంలో ముద్రించి పన్నా కమిటీల ఆధ్వర్యంలో ఇంటింటికి పంచి ప్రచారం చేస్తున్నారు.

BRS Election Campaign 2024 :బీఆర్ఎస్ సైతం ఎలాగైనా ఉమ్మడి జిల్లాలో గెలవాలని ఆరాటపడుతోంది. మహబూబ్​నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నాగర్​కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్ధి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ ప్రచారంలో వేగాన్ని పెంచారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్​లలో పాల్గొన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం అచ్చంపేట, గద్వాల, కల్వకుర్తిలో జరిగిన కార్నర్ మీటింగ్​లలో పాల్గొన్నారు. బీఆర్ఎస్‌ 10 సీట్లు గెలిస్తే ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడుతామని కేసీఆర్ తెలిపారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నాయకులు ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. పలు గ్రామాల్లో ర్యాలీలు చేపట్టి రచ్చబండ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

రేవంత్​కు నేనంటే ఎందుకంత కోపం? - మహిళ అనే గౌరవం లేకుండా అవమానిస్తున్నారు : డీకే అరుణ - DK Aruna Slams CM Revanth Reddy

డీకే అరుణ రాష్ట్రప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు : సీఎం రేవంత్‌ - CM Revanth Redddy Election Campaign

ABOUT THE AUTHOR

...view details